Man Died Chicken Knife : కాకినాడ జిల్లాలో కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Man Died Chicken Knife : కాకినాడ జిల్లాలో కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

POLICE

Man Died Chicken Knife : ఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కోడి పందాలు రెండు నిండు ప్రాణాలు తీశాయి. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతి చెందారు. కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ప్రత్తిపాడు ఆస్పత్రిలో ఇవాళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నిన్న కోడి పందాల బరి వద్ద కోడికి కత్తి కడుతూ గండి సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. రక్త స్రావం ఎక్కువ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందారు. నిన్న ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలోనూ జరిగింది. కోడి కత్తి కాలికి గుచ్చుకుని తీవ్ర రక్త స్రావం కావడంతో పద్మారావు అనే యువకుడు మృతి చెందారు.

Chicken Knife One Died : కోడి పందాల్లో విషాదం.. కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి

మరోవైపు ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామ శివారులో శిబిరాలు ఏర్పాటు చేసుకుని కోడి పందాలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ను తలపించేలా ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడ పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట, లోన బయట, పెద్ద బజార్, చిన్న బజార్ లను కూడా నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కాకినాడ, కృష్ణా, నంద్యాలతోపాటు తదితర జిల్లాల్లో జరుగుతున్న కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో భారీగా కోడి పందాల సందడి కనిపించింది. ఏలూరు జిల్లాలో కోడి పందాలు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ లను తలపించాయి. చీకటి పడ్డాక కూడా కోడి పందాలు కొనసాగాయి.

Chicken Bettings : తొలి రోజు జోరుగా కోడి పందాలు.. రూ.300 కోట్లకు పైగా చేతులు మారిన డబ్బు

ప్లడ్ లైట్ల వెలుగులో పందాలు నిర్వహించారు. కోడి పందాలను చూసేందుకు సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కోడి పందాలు శిబిరాల వద్ద మద్యం, మాంసం వంటి అన్ని సదుపాయాలను నిర్వహకులు కల్పించారు. దీంతో కోడి పందాల్లో పాల్గొంటున్న వారు శిబిరాల వద్దే మద్యం తాగుతూ మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందెం స్థావరాల వద్ద మద్యం ఏరులైపారుతోంది.