Chicken Knife One Died : కోడి పందాల్లో విషాదం.. కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల పోటీల్లో విషాదం నెలకొంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Chicken Knife One Died : కోడి పందాల్లో విషాదం.. కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి

DEAD

Chicken Knife One Died : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల పోటీల్లో విషాదం నెలకొంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిన్నటి నుంచి కోడి పందాలు కొనసాగుతున్నాయి. వీటిని చూసేందుకు గ్రామం నుంచే కాకుండా పక్కనున్న గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున అనంతపల్లికి తరలివచ్చారు. ఎంతో ఉల్లాసంగా జరుగుతున్న పోటీల్లో ఉన్న ఓ కోడి అకస్మాత్తుగా జనం మధ్యలోకి రావడంతో కోడి కత్తి గుచ్చుకుని పద్మరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం అతన్ని స్థానికులు నల్లజర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గంమధ్యలో అతను మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామ శివారులో శిబిరాలు ఏర్పాటు చేసుకుని కోడి పందాలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ను తలపించేలా ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడ పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట, లోన బయట, పెద్ద బజార్, చిన్న బజార్ లను కూడా నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు.

Chicken Bettings In AP : ఆంధ్రప్రదేశ్ లో జోరుగా కోడి పందాలు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు

పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కాకినాడ, కృష్ణా, నంద్యాలతోపాటు తదితర జిల్లాల్లో జరుగుతున్న కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో భారీగా కోడి పందాల సందడి కనిపించింది. ఏలూరు జిల్లాలో కోడి పందాలు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ లను తలపించాయి. చీకటి పడ్డాక కూడా కోడి పందాలు కొనసాగాయి.

ప్లడ్ లైట్ల వెలుగులో పందాలు నిర్వహించారు. కోడి పందాలను చూసేందుకు సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కోడి పందాలు శిబిరాల వద్ద మద్యం, మాంసం వంటి అన్ని సదుపాయాలను నిర్వహకులు కల్పించారు. దీంతో కోడి పందాల్లో పాల్గొంటున్న వారు శిబిరాల వద్దే మద్యం తాగుతూ మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందెం స్థావరాల వద్ద మద్యం ఏరులైపారుతోంది.