Andhra Pradesh : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంచాయితీ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల వెరిఫికేషన్

ఏలూరు జిల్లాలో నాలుగు సర్పంచ్, 47 వార్డు స్థానాలకు ఎన్నికలు పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు సర్పంచ్, 28 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Andhra Pradesh : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంచాయితీ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల వెరిఫికేషన్

ap panchayat elections

Updated On : August 13, 2023 / 10:28 AM IST

Andhra Pradesh Panchayat Elections : ఏపీలోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. ఏలూరు జిల్లాలో పంచాయితీ ఎన్నికలో నామినేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో నాలుగు సర్పంచ్, 47 వార్డు స్థానాలకు ఎన్నికలు పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి.

12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండు వార్డులకు నామినేషన్ లు దాఖలు కాలేదు. నాలుగు సర్పంచ్ లతో పాటు, 33 వార్డులకు ఈ నెల (ఆగస్టు)19న ఎన్నికలు జరగనున్నాయి. రేపు (సోమవారం) నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఉండడంతో ఏకగ్రీవం చేసుకునేలా పలువురు అభ్యర్థుల ప్రయత్నాలు చేస్తున్నారు.

TTD Alert : చిరుత దాడి ఘటనతో టీటీడీ అలర్ట్.. తిరుమల నడక మార్గంలో భద్రత కట్టుదిట్టం

అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో మూడు సర్పంచ్, 28 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

మిగిలిన 19 వార్డులకు ఈ నెల(ఆగస్టు)19న ఎన్నికలు జరగనున్నాయి. మూడు సర్పంచ్ స్థానాలకు 8 మంది పోటీ చేస్తున్నారు. రేపు (సోమవారం) నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఉండనుంది.