Tirupati : అదృశ్యమైన నలుగురు విద్యార్థులు క్షేమం.. ఎక్కడ ఉన్నారంటే..

చంద్రగిరికి చెందిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు బుధవారం అదృశ్యమైన విషయం విధితమే. వారి ఆచూకీని గురువారం పోలీసులు గుర్తించారు. ముంబైలో అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు...

Tirupati : అదృశ్యమైన నలుగురు విద్యార్థులు క్షేమం.. ఎక్కడ ఉన్నారంటే..

Studient Missing

Tirupati : చంద్రగిరికి చెందిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు బుధవారం అదృశ్యమైన విషయం విధితమే. వారి ఆచూకీని గురువారం పోలీసులు గుర్తించారు. ముంబైలో అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి నుంచి కొల్లాపూర్ అటు నుంచి ముంబై వెళ్లిన విద్యార్థినులను తిరిగి చంద్రగిరికి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేవలం చదువు పట్ల అయిష్టతతోనే విద్యార్థినిలు హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Students Missing : చెప్పకుండా సినిమాకు వెళ్లారు-టీచర్ మందలింపు-నలుగురు విద్యార్ధులు ఆదృశ్యం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో సంప్రదాయ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను నిర్వహిస్తున్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు సుమారు 350మంది విద్యార్థినులు ఇక్కడ వసతి పొందుతూ, తిరుపతి, చంద్రగిరిల్లోని పలు విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రశాంతి (కడప), స్రవంతి (విశాఖ), శ్రీవల్లి (విజయనగరం), వర్షిణి (విజయవాడ) ఉన్నారు. చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సోమవారం రాత్రి సమయంలో దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న వసతి గృహం ప్రహరీ గోడ దూకి ఈ నలుగురు విద్యార్థినులు వెళ్లిపోయారు.

Minister Peddireddy: ఫోన్ ట్యాపింగ్ చేశామని నేను చెప్పలేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఈ విషయమై పాఠశాల ఇన్ ఛార్జి లక్ష్మి విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థినుల ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలీసు స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థునుల ఆచూకీ బుధవారం వరకు లభించక పోవటంతో వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గురువారం ఎట్టకేలకు ముంబైలో విద్యార్థినుల ఆచూకీని గుర్తించిన పోలీసులు వారిని చంద్రగిరికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.