Chandrababu Last Elections : ఇదే నా చివరి ఎన్నిక-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా పత్తికొండ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అన్న చంద్రబాబు.. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.

Chandrababu Last Elections : ఇదే నా చివరి ఎన్నిక-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Updated On : November 16, 2022 / 11:23 PM IST

Chandrababu Last Elections : కర్నూలు జిల్లా పత్తికొండ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అన్న చంద్రబాబు.. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. నిండు సభలో నన్ను, నా భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు వాపోయారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చారని ధ్వజమెత్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”అసెంబ్లీలో సీనియర్ నాయకుడు అయిన నన్ను, నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి బయటకొచ్చాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తాను అని చెప్పాను. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది” అని చంద్రబాబు అన్నారు.