Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పోలీసులు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పోలీసులు మృతి

Accident

Updated On : July 24, 2022 / 2:12 PM IST

road accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. 30 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. స్థానికుల సాయంతో అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. మృతులు కర్ణాటక పోలీసులుగా గుర్తించారు.

Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి

రెండు ఇన్నోవా వాహనాల్లో కర్ణాటక నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఎస్‌ఐకి తీవ్రగాయాలవ్వగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.