Hanuman Jayanti 2021 : వివాదంలో హనుమాన్ జయంతి

Hanuman Jayanti 2021 : వివాదంలో హనుమాన్ జయంతి

Today Is Not Hanuman Jayanti Swami Govindananda Saraswati Says

Hanuman Jayanti 2021 : హనుమాన్ జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు 3సార్లు జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు, కొందరు వైశాఖ శుధ్ధ దశమినాడు, మరి కొందరు మార్గశిర మాసంలో జరుపుకుంటారు. ఈరోజు (వైశాఖ శుధ్ధ దశమి నాడు) టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలను స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి తప్పు పట్టారు. ఈరోజు  ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ … వేంకటాచల మహత్యం అనే గ్రంధంలో హనుమంతుని జయంతి శ్రావణ మాసం లో ఆచరించాలని ఉందని… కానీ ఇపుడు ఎందుకు ఆచరిస్తున్నారో అర్ధం కావటంలేదని ఆయన అన్నారు.

హనుమంతుని జన్మస్ధలం   విషయంలో తప్పుడు ఆధారాలు చూపించిన టీటీడీ ఇప్పుడు జన్మ తిధి విషయంలోనూ తప్పుడు లెక్కలు చూపించి వేడుకలు నిర్వహిస్తోందని   ఆరోపించారు.  నాలుగు నెలలపాటు పరిశోధన చేసిన   టీటీడీకీ హనుమాన్ జయంతి ఎప్పుడో తెలియకపోవటం హస్యాస్పదం అని ఆయన విమర్శిచారు.

హనుమంతుడి జన్మస్ధలం తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థం అని ప్రకటించిన టీటీడీ… ఈ రోజు ఆకాశగంగ తీర్థంలో జయంతి వేడుకలను నిర్వహించటాన్ని గోవిందానంద సరస్వతి తప్పుపట్టారు. హనుమంతుని జయంతి చైత్ర పూర్ణిమ లో ప్రపంచ వ్యాప్తంగా చేయడం జరుగుతోందని… టీటీడీ సత్యాన్ని కప్పిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని అన్నారు. టీటీడీ నిర్వహించిన జియోలాజికల్ సర్వే తప్పుల తడక అని, వైశాఖ శుధ్ధ దశమి రోజు హనుమాన్ జయంతి ఎందుకునిర్వహిస్తోందో టీటీడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర డూప్లికేట్ నెంబర్ వన్ ఆని వ్యాఖ్యానిస్తూ….సన్యాసులకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండకూడదని అన్నారు. సీఎం మద్దతు ఉన్నంత మాత్రాన విశాఖ శారదా పీఠం శంకర మఠం కాబోదని ఆయన తెలిపారు.