TTD Shocked Devotees : శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్.. తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. వసతుల పేరుతో భక్తులపై భారీగా వడ్డింపులకు తెర తీసింది. ఆధుణీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచింది.

TTD Shocked Devotees : శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్.. తిరుమలలో వసతి గదుల అద్దె భారీగా పెంపు

ttd

TTD Shocked Devotees : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. వసతుల పేరుతో భక్తులపై భారీగా వడ్డింపులకు తెర తీసింది. ఆధుణీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచింది. పెంచిన ధరలను ఈనెల 1వ తేదీ నుంచి టీటీడీ అమలు చేస్తోంది. పెంచిన ధరలతో సామాన్య, మధ్య తరగతి భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.

తిరుమల వ్యాప్తంగా అన్ని పాత వసతి కేంద్రాలను ఆధుణీకరించేందుకు ఇంజనీరింగ్ అధికారులు రూ.110 కోట్లతో టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టారు. ఏసీ, గ్రీజర్ వంటి సదుపాయాలు కల్పించి అద్దెలు పెంచారు. తిరుమలలో దాదాపు 6 వేల గదులు ఉన్నాయి. ఇప్పటికే తిరుమలలో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌసుబం, ఒకులమాత వసతి గృహాల్లో ఒక్కసారిగా రూ.500 నుంచి రూ.1000 వరకు పెంచారు.

Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం

ఈ నెల 1వ తేదీ నుంచి నారాయణగిరి రెస్టు హౌజ్ లోని 1,2,3 గదులను జీఎస్టీతో కలిపి రూ.150 నుంచి రూ.1700లకు పెంచారు. నారాయగిరి రెస్టు హౌజ్ లో నాలుగులో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700లకు పెంచారు. కార్నర్ షూట్ ను జీఎస్టీతో కలిపి రూ.2,200లకు పెంచారు. స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 నుంచి జీఎస్టీతో కలిపి రూ.2,800 చేశారు.

భక్తులు గదుల అద్దెతోపాటు డిపాజిట్ ను కూడా అంతే మొత్తంలో చెల్లించాల్సివుంది. దీంతో గదిని రూ.1700 లకు పొందితే డిపాజిట్ నగదుతో కలిపి రూ.3,400 చెల్లించాల్సివుంటుంది. ఈ ధరలపై సామాన్య భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తుల కోణంలో చూడాలని వారు కోరుతున్నారు.

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

ఇప్పటికే చాలా వరకు అతిథి గృహాల ధరలను పెంచిన టీటీడీ సాధారణ భక్తులు ఎక్కువగా వసతి పొందే రూ.50 అద్దెతో లభించే ఎస్ ఎంసీ, ఏఎన్ సీ, హెచ్ వీసీ, రూ.100 అందించే రామ్ భగీష, వారాహ స్వామి గెస్టు హౌజ్, ఎస్ఎన్ జీహెచ్, హెచ్ వీడీసీ, ఏబీసీ, టీబీసీ, సప్తగిరి అతిథి గృహాల్లో కూడా ఆధుణీకరణ పనులు పూర్తి చేసి గదుల అద్దె పెంచేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.