YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Chairman YV Subbareddy : తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని ఎప్పుడూ చెప్పలేదని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆదివారం మీడియాతో చైర్మన్ మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.
తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పండుతోంది. ప్రతిగంటకు 8వేల మంది భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశిస్తున్నారు. అయితే గంటకు 4 వేల మందికి మాత్రమే వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. అంతుకు మించి భక్తులకు దర్శనం కల్పించలేమని టీటీడీ తెలిపింది.
వైకుంఠ ఏకాదశి, గరుడ సువ రోజులకన్నా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ సైతం ఉక్కిరిబిక్కిరయింది. మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రద్దీ ఉంటుందని.. భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచించారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. బ్రేక్ దర్శనాలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరోవైపు క్యూలైన్లలో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. వైకుంఠం కాంప్లెక్స్ వెలుపల ఉన్నవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
- Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
- Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్‌తో ముప్పు
- TTD : నేడు టీటీడీ బోర్డు సమావేశం..సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీపై నిర్ణయం
- TTD Condemns Paripoornananda Allegations : ఆర్జిత సేవలపై పరిపూర్ణానంద ఆరోపణలు అవాస్తవం-టీటీడీ
- Minister Kottu Satyanarayana : ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు -మంత్రి కొట్టు సత్యనారాయణ
1New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
2Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
3Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా
4Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
5Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
6Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
7Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
8Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
9Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
10Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?