Tirumala : శ్రీవారి సేవకు కొత్తగా 8 మంది అర్చకులు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తగా 8 మంది అర్చకులను టీటీడీ నియమించింది.

Tirumala : శ్రీవారి సేవకు కొత్తగా 8 మంది అర్చకులు

Tirumala New Archakulu

Tirumala :  కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తగా 8 మంది అర్చకులను టీటీడీ నియమించింది. మీరాశి వంశానికి చెందిన 8 మందికి కొత్తగా శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించింది.

సుదీర్ఘ కాలం తర్వాత టీటీడీ కొత్తగా అర్చకులను విధుల్లోకి తీసుకుంది.  దీంతో మీరాశి వంశీకులలో నూతన తరానికి శ్రీవారి ఆలయంలో అర్చకత్వం చేసుకునే అవకాశం కల్పించినట్లైంది. 2007లో 24 మంది మీరాశి వంశీకులను…2018లో 9 మంది మీరాశి వంశీకులను టీటీడీ అర్చకులుగా నియమించింది.  శ్రీవారి ఆలయం లో నూతనంగా మూడు కుటుంబాల నుండి భాద్యతలు స్వీకరించిన అర్చకుల వివరాలు

1-ఏ.ఎస్.కె.ఎన్ దీక్షితులు-పైడిపల్లి వంశం
2-ఏ.ఎస్.కే.ఆర్.సి దీక్షితులు-గొల్లపల్లి వంశం
3-ఏఎస్ కృష్ణచంద్రదీక్షితులు-గొల్లపల్లి వంశం
4-ఏఎస్ భరద్వాజదీక్షితులు-గొల్లపల్లివంశం
5-ఏ ప్రశాంత్ శ్రీనివాస దీక్షితులు-తిరుపతమ్మ వంశం
6-ఏ.టీ. శ్రీహర్షశ్రీనివాస దీక్షితులు-తిరుపతమ్మ వంశం
7-ఏటీఆర్ రాహుల్ దీక్షితులు-తిరుపతమ్మ వంశం
8-ఏటీ శ్రీనివాస దీక్షితులు-తిరుపతమ్మ వంశం

పైడిపల్లి కుటుంబం నుండి. ఒకరు…గొల్లపల్లి కుటుంబం నుండి ముగ్గురు…తిరుపతమ్మ కుటుంబం నుండి నలుగురు..మొత్తం 3 కుటుంబాల నుండి 8 మంది అర్చకులుగా బాధ్యతలు స్వీకరించారు. కాగా .. మీరాశి వంశికుల కుటుంభంలో ఇది మరుపురాని రోజని… ప్రధాన అర్చకులు క్రిష్ణశేషాచల ధీక్షితులు వ్యాఖ్యానించారు. వంశపార్యపరంగా వస్తూన్న హక్కులును కల్పిస్తూ…. అర్చకులను రేగ్యూలరైజ్ చెయ్యడం ఆనందకరంగా ఉందని ఆయన అన్నారు.