టీటీడీలో శ్రీవారి అర్చకుడు కరోనాతో మృతి

  • Published By: sreehari ,Published On : August 6, 2020 / 06:26 PM IST
టీటీడీలో శ్రీవారి అర్చకుడు కరోనాతో మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా చాలామంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసా చార్యులు కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం స్విమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు.



గోవిందరాజస్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్ పై తిరుమలకు ఎన్వీ శ్రీనివాసచార్యులు వెళ్లారు. శ్రీనివాసర చార్యులు వయస్సు 45 ఏళ్లు.. శ్రీవారి ఆలయంలో అర్చకులుగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అర్చకుడు శ్రీనివాసాచార్యుల మృతిని టీటీడీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.



తిరుమలలో అర్చకులతో పాటు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. శ్రీవారి దర్శనాలు పున: ప్రారంభించిన తర్వాత నుంచి టీటీడీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇప్పటివరకూ వందకు పైగా కరోనా సోకినట్టు తెలుస్తోంది. 17 మంది శ్రీవారి అర్చకులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో చాలామంది అర్చకులు వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. అనంతరం వైద్యులు అర్చకులను క్వారంటైన్ సెంటర్ నుంచి డిశ్చార్చి చేశారు..