Medical Colleges: దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం
మేడ్చల్- మల్కాజ్‌గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్‌లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్‌లో నీలిమా ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది.

Medical Colleges: దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 18 కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. ఇక ఇందులో సైతం తెలంగాణ మెజారిటీ వాటా ఆక్రమించింది. రాష్ట్రంలో కొత్తగా 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలకు కేంద్ర పచ్చ జెండా ఊపింది.
Indira Gandhi: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యపై కెనెడాలో సంబరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఐదు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటుకు ఆమోదం లభించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ప్రారంభం కానున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, హైదరాబాద్, జనగాంలలో నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే మేడ్చల్- మల్కాజ్‌గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్‌లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్‌లో నీలిమా ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది.