Thirumala : వైకుంఠ ఏకాదశి వేడుకలు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.

10TV Telugu News

Vaikuntha Ekadashi celebrations : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే దేవాలయాకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12గంటల 5నిమిషాలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలతో పాటు, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 1.45గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఎల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ. ఆదిమూలం సురేష్ ఉన్నారు.

CJI Justice NV Ramana : వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

అలాగే తెలంగాణ మంత్రులు మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా, డీకే అరుణ అన్నారు. ఏపీ మాజీ హోం మంత్రి చినరాజప్ప, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆలయంతో పాటు వైకుంఠ ద్వారాన్ని నాలుగు టన్నుల పూలతో సుందరంగా అలంకరించారు.

Mukkoti Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, వర్చువల్‌ అర్జిత సేవా టికెట్ల దర్శనం ఇలా రోజుకు 45వేల మంది శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ద్వార చేసుకునేందుకు ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు.

 

×