30 రాజధానులు పెట్టుకుంటాం : రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం

  • Published By: madhu ,Published On : December 20, 2019 / 04:17 AM IST
30 రాజధానులు పెట్టుకుంటాం : రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం

రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని..ఇది ఎన్నికల హామీ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ..

రాజధానిలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే..టీడీపీ కార్యకర్తలే ఆందోళన చేస్తున్నారని, రైతులు లేరని వ్యాఖ్యానించారాయన. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. భూములు కొన్నామని అనడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 రాజధాలను ప్రతిపాదన మంచిదేనని, మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామన్నారు.

అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, 3 రాజధానలనేది ఏపీ అంశం..కేంద్రానికి సంబంధం ఏంటీ అని నిలదీశారు. ఈ అంశంపై కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకే సామాజిక వర్గం..ఒకే పార్టీ నేతలు అమరావతిలో భూములు కొన్నారని తెలిపారు. మార్చిలోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని, జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, స్థానిక పోరులో 90 శాతానికి సీట్లు సాధిస్తామన్నారు. 
Read More : రాజధాని నిరసన గళం : రోడ్లపై వంటలు