Wearing Masks Must : ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 06:45 AM IST
Wearing Masks Must :  ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఎక్కడా లేని విధంగా పరీక్షలు నిర్వహిస్తుండడం…పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు. కానీ కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు.

ఇంటి నుంచి బయటకు వస్తే..తప్పనిసరిగా mask ధరించాలని చెబుతున్నా..కొంతమంది ఏ ఏం కాదులే..అంటున్నారు. దీంతో వైరస్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో mask complusary అంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాలు, ప్రయాణాలు చేసే సమయంలో mask తప్పనిసరిగా ధరించాలని 2020, జులై 17వ తేదీ శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహార్ రెడ్డి ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ప్రజలు మాస్క్ ను ధరించడం అలవాటుగా మార్చుకోవాలని, స్థానిక జిల్లా కలెక్టర్ లు, రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

మరోవైపు ఏపీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2602 కరోనా పాజిటివ్ కేసులు ఇందులో రాష్ట్రానికి చెందిన 2592 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది.

దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40, 646 కు చేరింది. 24 గంటల్లో 42 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. అనంతపురం 6, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం 5 చొప్పున మరణించారు. గుంటూరు, పశ్చిమగోదారి జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

కడప, విశాఖలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, విజయనగరంలో ఇద్దరు మృతి చెందగా కృష్ణాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 534 కు చేరింది.