Buddha Venkanna : అనకాపల్లిలో పోటీ చేస్తానని ఎవరు చెప్పారు.. విజయవాడ పశ్చిమ సీటు నాదే : బుద్ధా వెంకన్న

చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు.

Buddha Venkanna : అనకాపల్లిలో పోటీ చేస్తానని ఎవరు చెప్పారు.. విజయవాడ పశ్చిమ సీటు నాదే : బుద్ధా వెంకన్న

Buddha Venkanna

Vijayawada West – Buddha Venkanna : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. తమ్మినేని సీతారాం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వద్ద 9 సంవత్సరాలు మంత్రిగా పని చేసిన సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ అంటే అసెంబ్లీలో టీచర్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం బుద్ధా వెంకన్న అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును చంపేస్తాం.. సెక్యూరిటీ తీసేస్తాం అంటే చూస్తూ కూర్చుంటామా అని హెచ్చరించారు. ‘తమ్మినేని సీతారామ్ కి దమ్ముంటే నేను చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోమనండి చూద్దాం’ అని సవాల్ చేశారు. కృష్ణా జిల్లా వైసీపీలోనే ఊర కుక్కలు ఉన్నాయని అనుకున్నామని.. కానీ, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఉన్నాయని తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

Mahesh Kumar Goud : కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర : మహేష్ కుమార్ గౌడ్

‘నేను అనకాపల్లిలో పోటీ చేస్తానని ఎవరు చెప్పారు.. విజయవాడ పశ్చిమలోనే పోటీ చేయబోతున్నాను’ అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లలో ఒక సీటు బీసీలకు ఇవ్వాలన్నారు. కచ్చితంగా తనకు పశ్చిమ ఇస్తారని అనుకుంటున్నానని తెలిపారు. చంద్రబాబు కోసం తాను ప్రాణాలకు తెగించి నిలబడ్డానని పేర్కొన్నారు. తనకు చంద్రబాబు అన్యాయం చేయబోరని వెల్లడించారు.

వేరేచోట పోటీ చేయమని చంద్రబాబు ఆదేశిస్తే ఆయన మాట వింటానని తెలిపారు. కేశినేని నాని గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని.. ఆయన సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కేశినేని నాని చంద్రబాబుని ఉద్దేశించి ఏమీ అనలేదన్నారు. చంద్రబాబును విమర్శిస్తే మాత్రం తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర శంకరాభరణం సినిమా లా బద్దలు కొట్టేసిందని కొనియాడారు.

BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు

ఆనాడు చంద్రబాబు పాదయాత్ర కన్నా ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు జనం భారీగా వస్తున్నారని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఉన్న ఇంటికి నోటీసులు ఇవ్వవచ్చు, బుల్డోజర్లతో గుద్దించవచ్చు.. కానీ, చంద్రబాబు ఇంటి మీదకు వస్తే ముఖ్యమంత్రి అయినా సరే జగన్ ఇంటి మీదకు వెళ్తామని హెచ్చరించారు.

చంద్రబాబు మీదికి బెజవాడలో ఎవరైనా వస్తే ఇక ఉపేక్షించేది లేదన్నారు. తమను జైల్లో పెట్టి ఎన్ కౌంటర్ చేసినా ఆగేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు గురించి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. అనకాపల్లిలో పోటీ చేస్తానని ఎవరు చెప్పారు.. విజయవాడ పశ్చిమ సీటు తనదేనని వెల్లడించారు.