ఎవరీ సంచైత గజపతిరాజు.. ఆమెకు పూసపాటి వారత్వం ఉంటుందా

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌(MANSAS TRUST) ఛైర్మన్‌గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ఈ ప్రాంత ప్రజలకు

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 11:43 AM IST
ఎవరీ సంచైత గజపతిరాజు.. ఆమెకు పూసపాటి వారత్వం ఉంటుందా

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌(MANSAS TRUST) ఛైర్మన్‌గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ఈ ప్రాంత ప్రజలకు

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌(MANSAS TRUST) ఛైర్మన్‌గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలియదు. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఓ రెండు జీవోలు సంచైత లైఫ్‌నే మార్చేశాయి. రాత్రికి రాత్రే ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టటమే కాకుండా.. హఠాత్తుగా తెరపైకి వచ్చి పూసపాటి వంశీయుల చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

అనూహ్యంగా ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంచైత:
2020 మార్చి 4న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజు బాధ్యతలు తీసుకున్నారు. ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి. వీరికి ఇద్దరు సంతానం. వారిలో చిన్న కుమార్తె సంచైత గజపతిరాజు. ఆనందగజపతిరాజు..ఉమా గజపతి వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం బాలీవుడ్‌ డైరెక్టర్‌ రమేష్‌ శర్మను ఉమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయనగరం వైపు వచ్చిందే లేదు. ఇప్పటి జనరేషన్‌కు వీరి గురించి అసలు తెలియనే తెలియదు. అయితే సనా అనే స్వచ్ఛంద సంస్ధ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సంచైత. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌కు, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం.. ఎవరి ఊహకు అందడం లేదు. 

బతికి ఉండగా వేధించిన కుటుంబం:
బఆనంద్‌ గజపతిరాజుతో ఉమా గజపతి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు కూడా రాజకుటుంబంతో కలవలేదు. తండ్రి ఆనందగజపతి రాజు ఉన్నంత కాలం ఇటు వచ్చిందే లేదు. అయితే ఆయన చనిపోయినప్పుడు మాత్రం విజయనగరం వచ్చారని .. వారికి తనకు తెలిసిన ఓ మిత్రుడి ఇంట్లో బస ఏర్పాటు చేశానని చెబుతున్నారు అశోక్‌ గజపతి రాజు. బతికి ఉండగా తన అన్న ఆనందగజపతిరాజును మానసికంగా వేధించిన ఆ కుటుంబం .. ఇప్పుడు ఇలా వచ్చి చిచ్చు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆశోక్‌ గజపతి రాజు.

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై అశోక్ న్యాయపోరాటం:
ఆనంద్‌ గజపతిరాజు, ఉమా గజపతి చట్టపరంగా విడాకులు తీసుకున్నా.. వారిద్దరి సంతానమైన సంచైతకు పూసపాటి వారత్వం ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే న్యాయ విద్య చదివిన సంచైత.. చట్టపరంగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే .. తండ్రి వారసురాలిగా పూసపాటి వంశంలోకి వచ్చారన్న చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అశోక్‌ గజపతిరాజును ఎదిరించలేక అదును కోసం ఇంతవరకూ వేచి చూసి.. ఇప్పుడు వైసీపీ సర్కారు అండతో … రాజకుటుంబంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై అశోక్‌ గజపతిరాజు కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న దానిపై.. విజయనగరం కోటలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read:  రాజుగారి ఇంట్లో వారసత్వ పోరు, బాబాయ్‌-అమ్మాయ్‌ మధ్య ముదురుతున్న వివాదం