Prakasam District: నాయుడుపాలెం, టంగుటూర్‌ల‌లో ఉద్రిక్తత.. వైసీపీ నేత హౌస్ అరెస్ట్.. పోలీసులు అదుపులో టీడీపీ ఎమ్మెల్యే

టంగుటూరులోని అశోక్ బాబు ఇంటివద్ద, నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటివద్ద అదేవిధంగా వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలను మోహరించారు.

Prakasam District: నాయుడుపాలెం, టంగుటూర్‌ల‌లో ఉద్రిక్తత.. వైసీపీ నేత హౌస్ అరెస్ట్.. పోలీసులు అదుపులో టీడీపీ ఎమ్మెల్యే

Kondapi MLA Veeranjaneya swamy

Prakasam District: ప్రకాశం జిల్లా (Prakasam District)  నాయుడుపాలెం (NaiduPalem), టంగుటూర్‌ (Tangutur) ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ (YCP), టీడీపీ  (TDP) నేతల సవాళ్ల మధ్య ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టాయిలెట్స్ నిర్మాణాలు ఎన్ఆర్‌జీసి నిధులలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ కొండపి ఇన్‌చార్జి వరికూటి అశోక్ బాబు ఛలో నాయుడుపాలెంకు పిలుపు నిచ్చారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే స్వామి స్వగ్రామం  నాయుడుపాలెంతో పాటు టంగుటూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టంగుటూరులోని వైసీపీ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోటీగా నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. టంగుటూరు, నాయుడుపాలెంలలో శాంతిభద్రతలు కాపాడడంకోసం ఒంగోలు నుండి ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.

Chandrababu – Amit Shah : అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం.. ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో తొలిసారి భేటీ

టంగుటూరులోని అశోక్ బాబు ఇంటివద్ద, నాయుడు పాలెంలోని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి ఇంటివద్ద అదేవిధంగా వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బలగాలను మోహరించారు. టంగుటూరు, నాయుడు పాలెంలో పోలీసు పికేటింగ్‌లు ఏర్పాటు చేశారు. వైసీపీ నేత వరికూటి అశోక్ బాబును టంగుటూరిలోని వారి స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు నాయుడు పాలెం నుండి టంగుటూరు వైపు ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, ఆయన వర్గీయులు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు హైవేపై అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు హైవేపై బైఠాయించారు. దీంతో హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

Andhra Pradesh : ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. విశాఖకు అమిత్ షా, తిరుపతికి జేపీ నడ్డా

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు కొండపీ సీఐ పాండురంగారావుకి దాడికి దిగారు. పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వావాదంతో ఎమ్మెల్యే స్వామి చొక్కా చినిగిపోయింది.  గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.