Andhra Pradesh : ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. విశాఖకు అమిత్ షా, తిరుపతికి జేపీ నడ్డా

Andhra Pradesh : 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.

Andhra Pradesh : ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. విశాఖకు అమిత్ షా, తిరుపతికి జేపీ నడ్డా

Andhra Pradesh

Andhra Pradesh – Amit Shah JP Nadda : బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. జూన్ 8న అమిత్ షా విశాఖకు వస్తుండగా, 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. మోదీ 9ఏళ్ల పాలనపై ఏపీలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.

ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారైంది. ఈ నెల 8న విశాఖలో అమిత్ షా, 10వ తేదీన తిరుపతిలో జేపీ నడ్డా పర్యటించనున్నారు. ప్రధాని మోదీ 9ఏళ్ల పాలనకు సంబంధించి ఏపీకి ఏం చేశాము? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాము? అనేది బహిరంగ సభల ద్వారా వివరించనున్నారు అమిత్ షా, జేపీ నడ్డా.

Also Read..Nara Lokesh : పాదయాత్రలో నారా లోకేశ్‌పై దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

గతంలో కర్నూలులో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన టూర్ వాయిదా పడింది. అమిత్ షా తాజా పర్యటన రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. పొత్తులపై చర్చల వేళ అమిత్ షా పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

పొత్తులకు సంబంధించి హైకమాండ్ చూసుకుంటుందని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ఇంపార్టెన్స్ ఏర్పడింది. పొత్తులకు సంబంధించి అమిత్ షా ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ బీజేపీ నేతల్లో నెలకొంది. ఓవైపు మోదీ పాలన గురించి వివరిస్తూనే మరోవైపు ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ హైకమాండ్ చర్యలు చేపట్టింది.

Also Read..BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు