Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ నేతల ఎదురుదాడి.. గుడివాడ, పేర్ని నాని విమర్శలు

‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా?

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ నేతల ఎదురుదాడి.. గుడివాడ, పేర్ని నాని విమర్శలు

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. కోటంరెడ్డిపై ఆ పార్టీకి చెందిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పేర్ని నాని, కొడాలి నాని, ఆనం విజయ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు

పేర్ని నాని ఈ అంశంపై బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా? కోటంరెడ్డి చెప్పుకొంటున్నట్లుగా ఆయన వైఎస్ కుటుంబానికి వీర విధేయుడైతే పార్టీ మారడం దేనికి?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు. మరో వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కూడా కోటం రెడ్డిపై విరుచుకుపడ్డారు.

Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

‘‘కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఖర్మ ఎవరికీ పట్టలేదు. అలాంటి అలవాట్లు చంద్రబాబుకే ఉన్నాయి. కోటంరెడ్డి పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఆరోపణలు చేస్తున్నాడు’’ అని కొడాలి నాని విమర్శించారు. ఇదే అంశంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదు. టీడీపీలోకి వెళ్లేందుకే కోటంరెడ్డి అవాస్తవాలు చెబుతున్నారు. హోంశాఖకు ఫిర్యాదు చేసి లేదా కోర్టుకు వెళ్లి కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల విషయంలో తన నిజాయితీ నిరూపించుకోవాలి. ఫోన్ ట్యాపింగ్‌పై కోటంరెడ్డితో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాట్లాడారన్న దాంట్లో నిజం లేదు’’ అని అన్నారు.

Union Budjet : ఆదాయ పన్ను కడుతున్న వారికే ఆ ఛాన్స్..

నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల ద్వారా కోటంరెడ్డి అనవసర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలుగుతారు. కోటంరెడ్డికి పార్టీలో గుర్తింపు లేదనడం సరికాదు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు’’ అని ఆనం వ్యాఖ్యానించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేశారు.

‘‘ఫోన్లలో అనేక థర్డ్ పార్టీ యాప్‌లు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి రికార్డు చేస్తే అది ట్యాపింగ్ అవుతుంది. అదే ఇద్దరు వ్యక్తుల సంభాషణ బయటకు వచ్చిదంటే ఎవరో ఒకరు రికార్డు చేసినట్లే. ఫోన్ రికార్డింగ్‌ను ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై రుద్ది, రాద్దాంతం చేయడం సరికాదు’’ అని గుడివాడ వ్యాఖ్యానించారు.