YCP MP : సుప్రీంకోర్టుకు చేరిన రఘురామ అరెస్టు వ్యవహారం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

YCP MP : సుప్రీంకోర్టుకు చేరిన రఘురామ అరెస్టు వ్యవహారం

Ycp Mp

Raghu Rama Krishnam Raju : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ అత్యవసర విచారణకు స్వీకరించింది. హైకోర్టులో విచారణ జరుగుతుండగానే..ఎంపీ కుమారుడు భరత్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కస్టడీలో ఉన్న తండ్రిని వేధించారని ఆరోపించారు. తన తండ్రికి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేసి చికిత్స అందించాలని కోరారు. ఇటు తన తండ్రికి ప్రాణహాని ఉన్నందున వై కేటగిరి భద్రతను కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ విన్నవించారు. ఈ రెండు పిటిషన్లపై 2021, మే 17వ తేదీ సోమవారం 10.30 గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు..రఘురామను రమేశ్ ఆసుపత్రికి తరలించనున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కేసులో.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును మరోసారి ఆస్పత్రికి తరలించారు సీఐడీ అధికారులు. హైకోర్టు ఆదేశాలను సీఐడీ అధికారులు పట్టించుకోలేదని రఘురామకృష్ణం రాజు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రఘురామ కృష్ణంరాజును జైలుకు ఎందుకు తరలించారని ధర్మాసనం సీఐడీ అధికారులను ప్రశ్నించింది. అయితే మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకే జైలుకు తరలించామని సీఐడీ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మరోవైపు రఘురామ ఆరోగ్యంగానే ఉన్నారని.. బీపీ, షుగర్ కంట్రోల్‌లోనే ఉన్నాయని మెడికల్ కమిటీ కోర్టు దృష్టికి తెచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు తోపులాటలో కాళ్లకు గీతలు పడ్డాయని, కొంత ఒత్తిడికి గురయ్యాయని వెల్లడించింది. కాళ్లపై కొట్టిన దెబ్బలు లేవని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. కేవలం ఒత్తిడి వల్లే తీవ్రమైన గాయాలు ఏర్పడ్డాయని వెల్లడించింది. వాదనలు విన్న అనంతరం.. రఘురామ కృష్ణంరాజుకు రమేశ్ హాస్పిటల్‌లో చికిత్స అందించాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.

ఇప్పటికే రఘురామకృష్ణంరాజును పోలీసులు జిల్లా కారాగారానికి తరలించారు. దీంతో జైలు అధికారులు ఆయనకు ఖైదీ నంబర్‌ను కేటాయించారు. రిమాండ్‌ ఖైదీగా వచ్చిన రఘురామకు 3468 నంబర్‌కు కేటాయించారు. అంతకుముందు రఘురామకృష్ణంరాజును నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు GGH వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.

Read  More : COVID-19 Vaccine Certificate : కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..