Vijayasai Reddy : అశోక్ గజపతిరాజుకు సవాల్ విసిరిన విజయసాయి రెడ్డి

సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా...అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. బహిరంగ చర్చకు సవాలు చేశారు.

Vijayasai Reddy : అశోక్ గజపతిరాజుకు సవాల్ విసిరిన విజయసాయి రెడ్డి

Vijayasai Reddy

Vijayasai Reddy criticizes : సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా…అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. అశోక్ గజపతిపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ‘మీడియాలో డిబేట్ కి నేను సిద్ధంగా ఉన్నాను.. నువ్వు సిద్ధమైతే రా’… అంటూ ఛాలెంజ్ చేశారు. సుమారు 846 ఎకరాలు దేవస్థానం భూమి గత ప్రభుత్వం హయాంలోనే అన్యాక్రాంతమైందని ఆరోపించారు విజయసాయిరెడ్డి.

8 వేల కోట్ల ఆస్తులను దోచుకున్నది అశోక్ గజపతి కాదా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. త్వరలోనే భూ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలోనే సింహగిరిపై అనేక అక్రమాలు జరిగాయని విమర్శించారు. మాన్సాస్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలను బయట పెడతానని పేర్కొన్నారు.

మహిళలపై అశోక్ గజపతి రాజుకు ఏ మాత్రం గౌరవం ఉన్నా.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకు మాన్సాస్ ట్రస్ట్ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. ‘నువ్వు నిజాయితీ పరుడు అయితే కోర్టుకెళ్లి చైర్మన్ పదవి తెచ్చుకోవడం ఎందుకు’ అని ఎద్దేవా చేశారు.