YS Viveka Murder Case : హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన వివేకానందరెడ్డి హత్య కేసు ఫైళ్లు

ఏపీలో పెను సంచలన కలిగించిన మాజీ ఎంపీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లు హైదరబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరబాద్ సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయి.

YS Viveka Murder Case : హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన వివేకానందరెడ్డి హత్య కేసు ఫైళ్లు

YS Viveka Murder Case

Updated On : January 24, 2023 / 4:49 PM IST

YS Viveka Murder Case : ఏపీలో పెను సంచలన కలిగించిన మాజీ ఎంపీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లు హైదరబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరబాద్ సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయి. వివేక హత్య కేసుకు సంబంధించి మూడు బాక్సుల్లో చార్జిషీట్లు, సాక్షుల వాంగ్ములం, ఫైల్స్ తరలించబడ్డాయి. కాగా వివేకా హత్యకు సంబంధించి కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు ఉన్నాయి. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫైల్స్ తో పాటు ఇతర సంబంధిత వాంగ్ములాలతో పాటు అన్ని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడ్డాయి.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి. వీటిని ఇవాళ కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించారు. మూడు పెట్టెల్లో వీటిని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకువచ్చారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన క్రమంలో హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ.. తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
కాగా తన తండ్రి హత్య కేసు విచారణ తీర్పు విషయంలో ఆలస్యం జరుగుతోందని..సాక్షులను బెదిరిస్తున్నారని కాబట్టి ఈకేసు విచారణను ఏపీకోర్టునుంచి తెలంగాణకోర్టుకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణను ఏపీ కోర్టునుంచి హైదరాబాద్ కోర్టుకు బదలి చేసింది. ఈక్రమంలో ఈహత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలను,డాక్యుమెంట్లను, నిందుతల వాంగ్ములాలతో సహా అన్ని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి.