YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

వైఎస్ వివేకా మరణంపై ఏపీలో జరుగుతున్న విచారణపై తమకు నమ్మకం లేదని, దర్యాప్తు సంస్థ అధికారులు సాక్షులను బెదిరిస్తున్నారని, అందువల్ల ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం జడ్జీలు జస్టిస్ ఎమ్ఆర్ షా, జస్టిస్ కృష్ణ కుమారితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై సమాధానం చెప్పాలని సీబీఐకి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 14కు వాయిదా వేసింది. ఈ కేసులో సునీత తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని, కేసులో నిందితులుగా ఉన్నవాళ్లంతా బెయిల్‌పై విడుదలై, సాక్షులను బెదిరిస్తున్నారని సిద్ధార్థ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసు విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని, సాక్షాలను చెరిపే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.