Visakha : డబ్బు బిల్డప్ ఉంటేనే మంత్రి పదవులు..ప్రజల కోసం అవసరమైతే ఉగ్రవాదిని అవుతా :YCP ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

75 ఏళ్లుగా పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి అనేదే రాలేదని అని బాబూరావు వాపోయారు. ప్రజలు కోసం తాను ఉగ్రవాదిని కూడా అవుతా అన్నా..తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.

Visakha : డబ్బు బిల్డప్ ఉంటేనే మంత్రి పదవులు..ప్రజల కోసం అవసరమైతే ఉగ్రవాదిని అవుతా :YCP ఎమ్మెల్యే గొల్ల బాబూరావు

Visakha

YCP MLA Golla Baburao : మంత్రి పదవి రాలేదని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. 75 ఏళ్లుగా పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి అనేదే రాలేదని అని బాబూరావు వాపోయారు. దీంతో పాయకరావుపేట ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని..వారి కోసం తాను ఏమైనా చేస్తానని..పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల కోసం అవసరమైతే నేను ఉగ్రవాదిని కూడా అవుతా అని అన్నాను తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదేని వివరణ ఇచ్చారు గొల్ల బాబూరావు.

తనకు మంత్రి పదవి కోసం ఇప్పటికే సజ్జలతో మాట్లాడానని అయినా ఏమాత్రం ఫలితం దక్కలేదని వాపోయిన బాబూరావు మరోసారి సజ్జలను కలిసి మాట్లాడానికి అమరావతి వెళతాను అని తెలిపారు. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఏమైనా చేస్తా..అవసరమైతే ఉగ్రవాదిని కూడా అవుతా..అనే ఉద్ధేశ్యం మాత్రమే తప్ప పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదని..తాను చేసిన వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా కాదు అని సవివివరంగా చెప్పుకొచ్చారు గొల్ల బాబూరావు. కొంతమంది వల్లే నాకు మంత్రి పదవి రాకుండా అయ్యిందని డబ్బు బిల్డప్ ఇచ్చే వారికే మంత్రి పదవులు దక్కుతున్నాయని గొల్ల బాబూరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

also read : AP : అధిష్టానంపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..‘నన్ను ఒకవైపే చూసారు..రెండో వైపు చూస్తే తట్టుకోలేరు..నేనేంటో చూపిస్తా’..
మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు.. అధిష్టానం తనకు అన్యాయం చేసిందంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయన మరోసారి స్పందించారు. తను వేరే ఉద్ధశ్యంతో వ్యాఖ్యలు చేయలేదని ముఖ్యంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

‘నేను ఎప్పటికీ హింసావాదిని కాదని.. అహింసా వాదినే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. అధిష్టానం మీకు అన్యాయం జరిగిందంటూ మీడియా అడిగిన ప్రశ్నకు.. నాకు మంత్రి పదవి రాకపోవడం పట్ల బాధపడటం లేదని..గత 75 ఏళ్ల మా నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదని ఇక్కడి ప్రజల్లో ఉంది. నేను సీఎం జగన్‌కు విధేయుడిని..’ అని ఎమ్మెల్యే బాబురావు స్పష్టంచేశారు. తన నియోజకవర్గ కార్యకర్తల్లో ఆవేదననను తెలిజేసే ప్రయత్నంలో ఇంతకు ముందు హింసావాదిగా ఉండే వాడిని.. ఇప్పుడు అహింసా వాదిగా మరానని చెప్పానే తప్ప మరో విధంగా చెప్పలేదన్నారు.

Also read : Beetroot : వృద్ధాప్య ఛాయలు తొలగించే బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్!

2009 వరకు తాన ప్రభుత్వ అధికారిగా పనిచేశానని.. తనను పిలిచి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాయకరావుపేట ఎమ్మెల్యే సీటును కేటాయించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తరువాత తనను కలచి వేసిందని.. ఆ బాధతో అప్పట్లో మొదటిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నానని చెప్పారు. 2019లో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది తనపై చాలా రకాలుగా అధిష్టానానికి చెప్పినా.. తనకు సీఎం జగన్ టికెట్ కేటాయించారని తెలిపారు.

అధిష్టానం కష్టాల్లో ఉన్నపుడే వారి వెంట ఉన్న విధేయుల్లో తాను మొదటి వరుసలో ఉంటానన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తనపై కుట్ర పూరిత రాజకీయం జరుగుతున్న మాట వాస్తవమేనని.. కానీ తాను అధిష్టానానికి గాని ఎప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ఎమ్మెల్యే బాబూరావు అన్నారు.