Home » Author »bheemraj
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టరేట్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు.
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది.
కడప జిల్లా బద్వేల్ లోని టేకురుపేట అటవీప్రాంతంలోని బాలుడి మిస్సంగ్ కలకలం రేపింది. అటవీ సిబ్బంది సహాయంతో గ్రామస్తులు, పోలీసులు రాత్రంతా అడవిలో గాలించారు. ఉదయం బాలుడి ఆచూకీ లభించింది.
హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బంది మెరుపు సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. జీతా పెంపు హామీ రాకపోవడంతో ఇవాళ కూడా విధులకు దూరంగా ఉన్నారు.
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బిప్లబ్ దేవ్ ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించి మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు జరుగనున్నాయి. ఈ అవగాహన కార్యక్రమానికి పీసీసీ కార్యవర్గ సభ్యులందరినీ కాంగ్రెస్ ఆహ్వానించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలను సదస్సుకు హాజరవ్వాలని అధిష్టానం కోరింది.
హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ అడ్మిన్, అకౌంట్ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపా�
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది.
టీడీపీ అధినేల చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పొడిచేది, చంపేది.. మొసలి కన్నీళ్లు కార్చేది ఈ పెద్ద మనిషే అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఫొటో షూట్, డ్రోన్ షాట్ల కోసం గోదా
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలను ఆలయ అర్చకులతోపాటు వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. మెట్రో రైలు సిబ్బంది ధర్నాపై యాజమాన్యం స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నాకు దిగారని పేర్కొంది.
యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్చింది. అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సునీల్ కనుగోలును అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.