Home » Author »bheemraj
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది.
ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతన, అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వయసు 100 ఏళ్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు.
భారత సంతతి మహిళ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది.ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విద్యా సంస్థలు, కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగకు జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఇచ్చింది.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడికెక్కాయి. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది.
చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులపై స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్ వార్ లో భూమి కంపించింది.
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరి�
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది.
ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బాలాకోట్ సరిహద్దు దగ్గర ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.
ఇకనుంచి రోబో న్యాయ వాదులు కూడా రాబోతున్నాయి. కోర్టుల్లో మానవ న్యాయవాదులతోపాటు రోబో న్యాయవాదులు కూడా కేసులను వాదించనున్నాయి. ఇకపై రోబో న్యాయవాది తొలిసారి కోర్టులో వాదించనుంది.