Rare Vulture : ఉత్తరప్రదేశ్ లో అత్యంత అరుదైన రాబందు ప్రత్యక్షం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతన, అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వయసు 100 ఏళ్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు. 

Rare Vulture : ఉత్తరప్రదేశ్ లో అత్యంత అరుదైన రాబందు ప్రత్యక్షం

vulture

Updated On : January 9, 2023 / 4:07 PM IST

rare vulture : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతన, అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వయసు 100 ఏళ్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు.  కాన్పూర్ లోని కల్నల్ గంజ్ లోని ఈద్గా స్వశాన వాటికలో ఆదివారం అత్యంత అరుదైన రాబందు కనిపించింది. దీనిని అరుదైన హిమాలయన్ గ్రిఫాన్ రాబందుగా జంతు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గతవారం రోజులుగా ఇదే ప్రాంతంలో తిరగడం చూసినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ రాబందును కొందరు పట్టుకుని బంధించి స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తెలుపు రంగులో పొడవాటి రెక్కలతో భయపెట్టేలా ఉన్న ఈ రాబందును చాలా మంది తమ ఫోన్లలో బంధించారు. దీన్ని రెక్కలు దాదాపు 5 అడుగులు ఉన్నాయని అటవీ అధికారులు తెలిపారు. హిమాలయ్ గ్రిఫాన్ రాబందు అనే ఈ పక్షి టిబెటన్ పీఠభూమిలోని హిమాలయాల్లో 13 వేల అడుగుల ఎత్తులో జీవిస్తాయని, ప్రస్తుతం ఇది అంతరించిపోయే దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

Rare Himalayan vulture : మహారాష్ట్రలో కనిపించిన అరుదైన హిమాల‌య రాబందు

భారత్ లో కనిపించే  9 రాబందు జాతుల్లో 4 ప్రమాదకరమైన జాతులను ఐయూసీఎన్ రెడ్ లిస్టులోని
అంతరించిపోతున్న జంతు జాతుల్లో చేర్చారు. భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం(1971) షెడ్యూల్-1లో రాబందులను ప్రభుత్వం చేర్చింది. ఇది అంతమవ్వడానికి దగ్గరగా ఉన్న జాతిగా ప్రభుత్వం గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది.