Home » Author »bheemraj
తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందాలు యమ జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు.
హైదరాబాద్ మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమని అన్నారు.
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా రక్తం కక్కుకుని మరణించారు.
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగకు జమ్మూకశ్మీర్ నుంచి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన పరకాలలో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని మభ్య పెట్టి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
నేడు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ఇవాళ ఈ సెమీ హైస్పీడ్ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభంకానుంది.
మధ్యప్రదేశ్ లో మాత్రం కుక్కలను పెంచుకుంటే కూడా పన్ను విధించనున్నారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే పన్ను విధించనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ లో ఓ హిందూ బాలుడికి జైలు శిక్ష విధించారు. ఈ ఘటన సింధ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమ్మాయిల మత మార్పిడిపై దేవుడు క్రూరమైన వాడని విమర్శిస్తూ సదరు బాలుడు సోషల్ మీడియాలో పోస్టు చేశా�
తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఆకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చి�
ఏపీలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు రెడీ అయ్యాయి. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేశారు.
సాధారణంగా ఏదైనా ఇల్లు ఒకే ఊరు, ఒకే రాష్ట్రం, ఒకే దేశంలో ఉంటుంది. కానీ ఓ ఇల్లు మాత్రం రెండు దేశాల పరిధిలో ఉంది. ఒకే ఇంటిలోని గదులు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటం విచిత్రం. ఇల్లు మాత్రం ఒకటే..కానీ కిచెన్ లో నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటే మాత్రం దే
ఏపీలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో భోగి వేడుకలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్ పీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక విషయాన్ని తెలిపింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్ పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పు చేసింది.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు.