Governor Tamilisai React : మలక్ పేట ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతి బాధాకరం : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమని అన్నారు.

Governor
Governor Tamilisai React : హైదరాబాద్ మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమని అన్నారు. ఈ మరణాల విషయంలో గైనకాలజిస్టుగా తనకు ఎన్నో ప్రశ్నలున్నాయని చెప్పారు. అందుకే ఆ ఆస్పత్రికి వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపారు. ఇవాళ తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆస్పత్రిని సందర్శించాలనుకున్నా.. కానీ పండుగ కావడంతో వెళ్లలేదని స్పష్టం చేశారు.
గతంలోనూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమయ్యాయని వెల్లడించారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారని గుర్తు చేశారు. వైద్యరంగంలో వసతులు పెరగడం లేదని చెప్పడం లేదు.. ఇంకా మెరుగుపడాలని అంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో జనాభాకు తగ్గట్లుగా వైద్యరంగంలో వసతులు మరింతగా మెరుగుపడాలని పేర్కొన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Two Infants Dead : హైదరాబాద్ లో ఇద్దరు బాలింతలు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లేని.. తన పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వర్సిటీ నియామకాల బిల్లులో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ నియామకాల బిల్లు వివాదాలతో ఆలస్యం కావొద్దన్నారు. ఈ తరహా విధానాలపై కోర్టులు గతంలో అభ్యంతరం తెలిపాయని ఆమె గుర్తు చేశారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.