Volunteer Suicide : చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య.. చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్
చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు.

SUICIDE
volunteer Suicide : చిత్తూరులో వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జోగు కాలనీలో శరవణ అనే వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ రాశారు. వైసీపీ నాయకులు తమ వద్ద డబ్బులు అప్పుగా తీసుకుని ఇవ్వలేదని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. అడిగితే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లుగా తెలిపారు.
చిత్తూరు వైసీపీ నాయకుడు సయ్యద్, రాష్ట్ర మహిళ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి తనకు డబ్బులు ఇవ్వాలని లెటర్ లో రాశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చానని, పలు మార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోగా పలు మార్లు బెదిరించినట్లు వెల్లడించాడు. బలవంతం పెట్టి నీ కుటుంబాన్ని ఏమైనా చేస్తామని వాలంటీర్ ను బెదిరించారని తెలుస్తోంది.
గుంటూరులో మహిళా వాలంటీర్ ఆత్మహత్య
ఇదే విషయాన్ని శరవణ సూసైడ్ నోట్ రాసి వారి పేర్లు, వారు ఎంత డబ్బు ఇవ్వాలన్న విషయాన్ని సూసైడ్ నోట్ లో రాసి తన చావుకు వీరే కారణమని పేర్కొంటూ నిన్న రాత్రి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మృతితో కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.
సంపాదించిన డబ్బంతా మీకే ఇచ్చాడంటూ అక్కడికి వచ్చిన డబ్బులు తీసుకున్న వ్యక్తులతో గొడవకు దిగారు. చిత్తూరులో ఈ ఘటన సంచలనంగా మారింది. అధికార పార్టీ నేతలు వాలంటీర్ దగ్గర డబ్బులు తీసుకుని అతని మరణానికి కారణమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో గతంలో కూడా పలువురు వాలంటీర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.