Home » Author »murthy
ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాం
మద్యం సేవించిన సమయంలో సెల్‌ఫోన్ తీసి దాచిపెడితే..దానికోసం ఒక స్నేహితుడిని కొట్టి చంపి, కాల్చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కొందరు మనుషులు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మూడు ముళ్లువేసి తాళి కట్టిన భార్య అదనపు కట్నం తేలేదని ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న భర్త ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం సమాధుల వద్ద తవ్వకాలు జరపటం కలకలం రేపింది. జిల్లాలోని గుర్రంకొండలో ఉన్న టిప్పు సుల్తాన్ మేనమామ అమీర్ రజాక్ అలీఖాన్ సమాధి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 20 అడుగుల మేర తవ్వకాలు జరిపారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ఇద్దరు ప్రియులతో కలిసి అతి క్రూరంగా హత్య చేయించిందో ఇల్లాలు.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని... జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
వినియోగదారుల సమాచార పరిరక్షణ, గోప్యత అంశంలో గూగుల్ ప్రతినిధులు ఇచ్చిన సమాధానం వింటే సమాచార రక్షణ అన్న పదం ఎంత హాస్యాస్పదమో అర్ధమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి.. వ్యక్తిగత సహాయకుడిగా.. నమ్మకంగా ఉంటూ ఆయన బ్యాంకు ఖాతానుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన నయ వంచుకుడి ఉదంతం కర్నాటకలో వెలుగు చూసింది.
చంద్రబాబు 'జూమ్' వదిలి జనంలోకి రావాలని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.
తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 4,9 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్ట్ గా తెలుగు ఉండాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావల్సి ఉందని, తనపై ఉన్న లుక్ ఔట్ నోటీసులు పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభంకానున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచిత్రమైన కేసు నమోదైంది. తన భార్య కనిపించటం లేదని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయగా ....నా భర్త అతడి భార్యతోనే కలిసి పారిపోయిందని మరో మహిళ వచ్చి ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,22,593కు చేరింది.
మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర అదివారం తెల్లవారు ఝూమున జరిగిన ఆడికారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.