Hidden Treasures : చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం సమాధుల వద్ద తవ్వకాలు జరపటం కలకలం రేపింది. జిల్లాలోని గుర్రంకొండలో ఉన్న టిప్పు సుల్తాన్ మేనమామ అమీర్ రజాక్ అలీఖాన్ సమాధి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 20 అడుగుల మేర తవ్వకాలు జరిపారు.

Hidden Treasures : చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

Excavation For Hidden Treasures

Updated On : June 30, 2021 / 10:54 PM IST

Hidden Treasures :  చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కోసం సమాధుల వద్ద తవ్వకాలు జరపటం కలకలం రేపింది. జిల్లాలోని గుర్రంకొండలో ఉన్న
టిప్పు సుల్తాన్ మేనమామ అమీర్ రజాక్ అలీఖాన్ సమాధి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 20 అడుగుల మేర తవ్వకాలు జరిపారు.

ఈ సమాధి సుమారు 300 ఏళ్ల నాటిదని స్ధానికులు తెలిపారు. సమాధి ప్రాంతంలో భారీ గొయ్యి ను గుర్తించిన మత పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గ్యాస్ కటర్, నిచ్చెన, సుత్తి తదితర పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.

గడిచిన 15 రోజులుగా గుప్తనిధుల ముఠా రాత్రిపూట తవ్వకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.