Sujana Chowdary : లుక్‌ఔట్ నోటీసులుపై హైకోర్టులో సుజనాచౌదరి పిటీషన్
అమెరికాలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావల్సి ఉందని, తనపై ఉన్న లుక్ ఔట్ నోటీసులు పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Sujana Chowdary
Sujana Chowdary : అమెరికాలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావల్సి ఉందని, తనపై ఉన్న లుక్ ఔట్ నోటీసులు పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సీబీఐ 2019 లో సుజనా చౌదరి పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. లుక్ ఔట్ నోటీసులను సవాల్ చేస్తూ సుజనా చౌదరి 2019లో వేసిన పిటీషన్ హై కోర్టులో పెండింగ్ లో ఉంది.
అయితే అమెరికాలో జరిగే సదస్సుకు హాజరు కావల్సిఉన్నందున ఆ పిటీషన్ ను త్వరగా విచారించాలని సుజనా తరుఫు న్యాయవాది ఈ రోజు న్యాయస్ధానాన్ని కోరారు. కాగా….అమెరికా నుంచి అందిన ఆహ్వానం వివరాలను సమర్పించకుండా అత్యవసరంగా విచారణ చేపట్టలేమన్న న్యాయస్ధానం విచారణ జులై 7కి వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలకనుగుణంగా ఎంపీ సుజనా చౌదరిని విచారించామని అవసరమైతే మళ్లీ పిలుస్తామని హై కోర్టు సీబీఐ కి తెలిపింది. విచారణ పేరుతో మళ్లీ మళ్లీ పిలిచే అవకాశం ఉందని సుజనా తరుఫు న్యాయవాది వాదించారు. ఒక వేళ విచారణకు పిలిస్తే సుజనాకు ముందస్తుగా నోటీసులివ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ నోటీసులిచ్చాక అభ్యంతరం ఉంటే మళ్లీ పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని సుజనాకు హైకోర్టు సూచించింది.