Telangana Covid-19 : తెలంగాణలో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,22,593కు చేరింది.

Telangana Covid-19 : తెలంగాణలో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు

Telangana New Covid Cases

Updated On : June 29, 2021 / 8:09 PM IST

Telangana Covid-19 : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,22,593కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  ఈరోజు విడుదల చేసిన  హెల్త్  బులెటిన్‌ లో తెలిపింది.

గడిచిన 24 గంటల్లో కరోనా వలన ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,651కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా కి చికిత్స పొంది 1,362 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 6,05,455కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,487 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా జీహెచ్ఎంసీ  పరిధిలో గడచిన 24 గంటల్లో 130 మందికి కోవిడ్ సోకింది. ఖమ్మం జిల్లాలో 102 మందికి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో 60 మందికి కోవిడ్ సోకింది.