Home » Author »naveen
మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టరాని కోపం కనిపించింది. వెధవల్లారా, సిగ్గు లేదా అంటూ నిప్పులు చెరిగారు. మీ వల్లే దేశం ఇలా ఉంది అంటూ విద్యార్థులపై విరుచుకుపడ్డారు.
బిలాయ్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాల రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట రొమాన్స్ లో మునిగితేలింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కొందరు దీన్ని వీడియో తీశారు.
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాప�
గవ్వల వైద్యం పేరుతో పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కేటుగాడి బాగోతం బయటపడింది. మంత్రాలు, భూత వైద్యంతో పేరుతో గవ్వలను చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టేస్తాడట ఈ కేటుగాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా చెలామణి అవుతున్న శ్యామ్ సుందర్..
తిరుమల భద్రత విషయంలో టీటీడీ ఎక్కడా రాజీపడటం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో అన్నదానం నుంచి డంపింగ్ యార్డు వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ కు పర్మిషన్ ఇచ్చామని తెలిపారాయన. ఇప్పటికే డ్రోన్ వ్యవహారంపై కేసు నమోదు చేశామని చెప్పారు. వైర�
ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు.
చైనా న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజువారీ మరణాల సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందన్న అంతర్జాతీయ సంస్థల అంచనాలు చైనీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు.
10 వేలు కాదు 20 వేలు కాదు.. ఏకంగా లక్షకు పైనే.. హైదరాబాద్ లో ఉన్న అక్రమ నిర్మాణాల సంఖ్య ఇది. ఒక్క సిటీలోనే ఇన్ని ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉండి ఉంటాయి. మిగతా చోట్ల పెద్దగా ప్రమాదాలు జరగవు కాబట్టి.. వాటి మీద చర్చ తక్కువగా జరుగుతోంది.
సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనపై సింగర్ మంగ్లీ స్పందించింది. ఇది దాడి కాదని మంగ్లీ చెప్పింది. దీనికి, తనకు సంబంధమే లేదంది. ఎందుకు ఇలా విష ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదంది.
ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ లో పాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై దుండగులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది.
బాపట్ల జిల్లా కొరిశపాడులో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టెక్కి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. చెట్టు మధ్యలో ఉన్న విద్యుత్ తీగలను గమనించని చిన్నారులు..
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించిన తిరుమల పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక�
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇలా ఒక్కటేమిటి.. చాలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి. క్షణాల్లో సెటిల్ మెంట్లు చేసేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎంద
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర కార్లలో మంటలు చెలరేగాయి. గాంధీభవన్ సమీపంలోని గృహకల్ప భవనం ముందు ఎగ్జిబిషన్ కు వచ్చిన వారు కార్లు పార్క్ చేశారు. ఇందులోని ఒక ఎలక్ట్రిక్ కారు నుంచి మంటలు చేలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు వ్యా�
అనుమానం పెను భూతమైంది. పగతో రగిలిపోయిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. శాంతికి చిహ్నమైన పావురాలను చంపేశాడు. పొరుగింటి వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడింది.
తిరుమల శ్రీవారి ఆలయంపైన డ్రోన్ల వివాదం మలుపు తిరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. డ్రోన్లతోనే తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు తేలింది.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ వింగ్ అధికారులు, సిబ్బంది శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు.
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఓ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కృష్ణా ఎక్స్ ప్రెస్ రైల్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేశారు.