Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసుల అనుమతి.. కండీషన్స్ అప్లయ్, ప్రధాన షరతు ఏంటంటే..

ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు.

Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసుల అనుమతి.. కండీషన్స్ అప్లయ్, ప్రధాన షరతు ఏంటంటే..

Updated On : January 23, 2023 / 4:56 PM IST

Nara Lokesh Padayatra : ఉత్కంఠకు తెరపడింది. టెన్షన్ వీడింది. ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్తూరు పోలీసులు. చట్టప్రకారమే లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని లోకేశ్ కు పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది.

నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రను ఎందుకు రిజెక్ట్ చేస్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. దీనికి సంబంధించి కాసేపట్లో చిత్తూరు జిల్లా ఎస్పీ నుంచి అధికారిక ప్రకటన రానుంది. అయితే కండీషన్స్ అప్లయ్ అంటున్నారు పోలీసులు.

Also Read..Nara Lokesh: ‘యువగళం’ పేరుతో ప్రజల్లోకి లోకేష్.. నేడు పాదయాత్ర వివరాలు వెల్లడించనున్న టీడీపీ నేతలు

ఎక్కడా కూడా లోకేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అన్నది పోలీసుల ప్రధాన షరతుగా తెలుస్తోంది. ఇక పాదయాత్రలో మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే ముందుగానే పోలీసులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలం ఏదైనా ముందుగానే తమకు చెప్పాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనేక షరతులతో నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వబోతున్నట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు.

ఈ నెల 27న యువగళం పేరుతో నారా లోకేశ్ కుప్పం నుంచి భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 4వేల కిలోమీటర్లు, 400 రోజులు అన్న రీతిలో పాదయాత్ర చేయబోతున్నారు. ఓవైపు జీవో నెంబర్ 1పై హైకోర్టు జడ్జిమెంట్ వెయింటింగ్ లో ఉంది. మరోవైపు పోలీసుల ఆంక్షలు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది.

Also Read.. Lokesh’s Padayatra Suspense : టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్.. వర్ల రామయ్య మరోసారి డీజీపీకి లేఖ

డీజీపీ నుంచి టీడీపీ ముఖ్య నేతలకు లేఖలు రావడం, మళ్లీ టీడీపీ ముఖ్య నేతలు డీజీపీకి సమాధానం ఇవ్వడం జరిగాయి. ఇలాంటి అనేక చర్చలు, సంప్రదింపులు నడిచాయి. చివరికి అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు చెప్పడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కాగా పాదయాత్ర తొలి రోజు కుప్పంలో భారీ బహిరంగ సభకు లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, ఎక్కడ బస చేస్తారు, ఎక్కడెక్కడ పాల్గొంటారు, ఎక్కడ సభలు ఉంటాయి లాంటి వివరాలతో కూడిన ఒక వినతిపత్రం తనకు అందిందని, వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి పాదయాత్రకు అనుమతి మంజూరు చేస్తున్నామని, అయితే ఆ పాదయాత్రను షరతులకు లోబడి చేయాల్సి ఉంటుందని చిత్తూరు ఎస్పీ స్పష్టం చేశారు.