Lokesh’s Padayatra Suspense : టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్.. వర్ల రామయ్య మరోసారి డీజీపీకి లేఖ

టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా.. పాదయాత్రపై తాము తగ్గేదేలే అని టీడీపీ అంటోంది.

Lokesh’s Padayatra Suspense : టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్.. వర్ల రామయ్య మరోసారి డీజీపీకి లేఖ

Nara Lokesh

Lokesh’s Padayatra Suspense : టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా.. పాదయాత్రపై తాము తగ్గేదేలే అని టీడీపీ అంటోంది. యువగళం పేరిట ఈనెల 27న కుప్పం నుంచి పాదయాత్రకు లోకేష్ రెడీ అవుతున్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అంటున్నారు.  వైసీపీ పాలనపై ప్రజల తరుపున పోరాడేందుకే లోకోష్ పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. యాత్రకు సమయం సమీపిస్తున్నా అనుమతులు ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ పాదయాత్ర అగబోదని స్పష్టం చేశారు.

మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. ఇదే సమయంలో
డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై చర్చ జరుగుతోంది. లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ కోరుతూ వర్ల రామయ్య రాసిన లేఖకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రిప్లై ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర డిటెయిల్డ్ రూట్ మ్యాప్, పాదయాత్రలు జరిగే తేదీలు, ఎంత మంది పాల్గొంటారు అనే వివరాలు కావాలని కోరారు. యాత్రతో ఉపయోగించే వాహనాలు నైట్ హాల్ట్ వివరాలు, పాదయాత్ర బాధ్యుల ఫోన్ నెంబర్లు సహా అన్ని వివరాలు అందజేయాలని కోరారు.

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. జనవరి 27 నుంచి యాత్ర ప్రారంభం

వాహనాల నంచి పాదయాత్రలో పాల్గొనే వారి వరకు అన్ని వివరాలు అందజేయాలని డీజీపీ రాసిన లేఖపై టీడీపీ తీవ్రంగా మండిపడుతోంది. గతంలో జరిగిన పాదయాత్రలకు ఇలాంటి సమాచారం ఎవరూ కోరలేదని, పాదయాత్రలో పాల్గొనే వారి వివరాలు అందజేయడం ఎలా కుదురుతుందని కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డీజీపీకి కౌంటర్ గా మరో లేఖ రాశారు. నాటి వినోబాబావే నేటి ప్రధాని వరకు చేసిన యాత్రలను వర్ల రామయ్య ప్రస్తావించారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రల సమయంలోనూ ఇలాంటి సమయంలో
ఇలాంటి సమాచారం ఎవరూ కోరలేదని గుర్తు చేశారు. అనుమతుల పేరుతో అడ్డుకున్న చరిత్ర ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదంటూ టీడీపీ రాసిన లేఖ ఇప్పుడు పొలిటికల్ గా కాక రేపుతోంది.
వాస్తవానికి లోకేష్ పాదయాత్రకు అనుమతులు కోరుతూ టీడీపీ ప్రధాని కార్యదర్శి వర్ల రామయ్య
జనవరి 9న డీజీపీపి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఈ మెయిల్ లో లేఖలు పంపారు.

Nara Lokesh Padayatra: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు లభించని అనుమతి

మరుసటి రోజే డీజీపీ కార్యాలయంలో లేఖను అందజేశారు. 11న హోంశాఖ కార్యదర్శి కార్యాలయంలో అనుమతులు కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభం కానున్నా కుప్పం, పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు డీస్పీలకు లేఖలు రాశారు. పాదయాత్ర తేదీ దగ్గర పడుతుండటంతో పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో అనుమతులు కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ వర్ల రామయ్య మళ్లీ డీజీపీకి లేఖ రాశారు.

లోకేష్ పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారనేది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఆవేదన బట్టి ఉంటుందని వర్ల రామయ్య అన్నారు. అనుమతుల పేరుతో అడ్డుకున్న చరిత్ర ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదన్నారు. లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్, అన్ని వివరాలు స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడూ పంచుకుంటామని చెప్పారు. ఎప్పటికప్పుడూ వివరాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామంటూ డీజీపీకి లేఖ రాశారు.