రైతు వేదిక ఒక ఆటంబాంబ్, అద్భుతమైన శక్తి – కేసీఆర్

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 02:05 PM IST
రైతు వేదిక ఒక ఆటంబాంబ్, అద్భుతమైన శక్తి – కేసీఆర్

CM KCR to inaugurate Rythu Vedika : రైతు వేదిక ఆటంబాబ్, అద్భుతమైన శక్తి అన్నారు సీఎం కేసీఆర్. రైతాంగం సంఘటితం కావాలని ఆకాంక్షిస్తూ..రైతు వేదికలను ఏర్పాటు చేశామన్నారు. అందుకే రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పూర్తి కావాల్సి ఉంది. వారం రోజుల్లో అన్నీ కంప్లీట్ అవుతాయన్నారు.



జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను 2020, అక్టోబర్ 31వ తేదీ శనివారం ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….



‘రైతుల్లో ఒక ఐకమత్యం లేకపోవడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయని, సంఘటితం అవుతున్నామని తెలంగాణ రైతాంగం నిరూపించాలని పిలుపునిచ్చారు. ఏ పంట పండించాలో రైతులు నిర్ణయించాలని, ఎవరో నిర్ణయించడం కాదన్నారు. రైతు బంధు కమిటీలు నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖలో ప్రబలమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు.



ఏ పంట వేస్తే మంచిదనే దానిపై నియమించిన శాఖ సూచనలు చేస్తుందన్నారు. దీనిపై రైతు వేదికల్లో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు తాను వెళ్లడం జరిగిందని, ఒక హాల్ లో రైతులు కూర్చొని పరస్పరం పంచుకోవడం వల్ల అక్కడ మేలు జరుగుతుందన్నారు. ఐక్యమత్యంగా ఉంటే అనేక లాభాలున్నాయని, రైతు వేదికలు గొప్ప శక్తిగా మారుతాయన్నారు సీఎం కేసీఆర్.