ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం.. టీచర్లు, విద్యార్థులకు కొవిడ్.. ఆందోళనలో తల్లిదండ్రులు

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 11:30 AM IST
ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం.. టీచర్లు, విద్యార్థులకు కొవిడ్.. ఆందోళనలో తల్లిదండ్రులు

teachers students tested corona positive: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. రెండు రోజుల క్రితం స్కూళ్లు తెరుచుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, అధికారులు ఊలిక్కిపడ్డారు. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, టీచర్‍కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అలాగే పచ్చవ గ్రామంలో ఇద్దరు విద్యార్థులతో పాటు ఒక ఉఫాధ్యాయుడికి వైరస్‌ బారిన పడ్డారు. దీంతో పాటు త్రిపురాంతకం ఓ టీచర్‌, పీసీపల్లిలోని విద్యార్ధితో పాటు టీచర్ కోవిడ్‌ కాటుకు గురయ్యారు.


పెద్దగొల్లపల్లి హైస్కూల్‍లో మరో ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఒక్క రోజే ఇన్ని కేసులు రావడంతో జిల్లాలోని మిగతా పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పలు పాఠాశాలల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు.
https://10tv.in/indian-child-poverty-charity-offers-free-school-meals-in-england/
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. కేంద్రం క్రమంగా సడలింపులు ఇవ్వడంతో ఇటీవలే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఏపీలోనూ నవంబర్ 2 నుంచి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. రొటేషన్ పద్దతిలో క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పట్టికి టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడటం కలకలం రేపింది.