Hindenburg : మరో ‘బిగ్ వన్’పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ..! ఈసారి బ్రహ్మాస్త్రం ఎవరిపైనో..!!

‘హిండెన్ బర్గ్’ (Hindenburg)రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘అదానీ (Adani)గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది.

Hindenburg : మరో ‘బిగ్ వన్’పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ..! ఈసారి బ్రహ్మాస్త్రం ఎవరిపైనో..!!

“New report soon—another big one.” Hindenburg tweeted..

Hindenburg :  ‘హిండెన్ బర్గ్’ (Hindenburg) రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది ‘అదానీ (Adani) గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక – మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది.  ‘హిండెన్ బర్గ్’ రిపోర్టుతో అదానీ వ్యాపారాలు దాదాపు అడుగంటిపోయాయి. ‘హిండెన్ బర్గ్’ తన రిపోర్టుతో అదానీ కంపెనీలను పాతాళంలోకి నెట్టేసింది. ప్రపంచ కుబేరుల స్థానం నుంచి అదానీ దారుణమైన స్థానానికి దిగజారిపోయాడు. అలా అమెరికన్ సంస్థ ‘హిండెన్ బర్గ్’ రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ రిపోర్టుతో కొట్టిన దెబ్బకు ఇప్పటీకి అదానీ కోలుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక – మరో బిగ్ వన్ పై’’ అంటూ బాంబు పేల్చింది. దీంతో బిలియనియర్లుగా పేరొందినవారి గుండెల్లో బుల్లెట్ రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఈసారి హిండెన్ బర్గ్ సంస్థ విసిరే బ్రహ్మాస్త్రానికి బలి అయిపోయే పారిశ్రామిక వేత్తలు ఎవరు? అని ఆర్థిక విశ్లేషకులు సైతం ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.

అదానీ సంగతి అలా ఉంటే హిండెన్ బర్గ్ సంస్థ మరో పెద్ద సంస్థపై గురి పెట్టినట్లుగా హింట్ ఇచ్చింది. త్వరలోనే మరో పెద్ద సంస్థపై తాము నివేదికను విడుదల చేయబోతున్నట్టు హిండెన్ బర్గ్ రీసెర్చ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో హిండెన్ బర్గ్ విసిరే బ్రహ్మాస్త్రం ఏ సంస్థపైనా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో పాటు పెట్టుబడిదారుల గుండెల్లోను.. బుల్లెట్ ట్రైన్ పరుగులు తీస్తున్నాయి. ‘‘త్వరలోనే కొత్త నివేదిక – మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఇప్పటికే అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభం మొదలైంది. కీలక బ్యాంకులు మూత పడ్డాయి. ఈక్రమంలో హిండెన్ బర్గ్ నివేదిక దేనికి సంబంధించి అయి ఉంటుంది? అనే ప్రశ్నలు పెట్టుబడిదారులను బుర్రల్ని తొలిచేస్తున్నాయి. మరి హిండెన్ బర్గ్ ఈసారి కూడా భారతీయ సంస్థపైనే టార్గెట్ చేస్తుందా?అనే ఆందోళన కూడా లేకపోలేదు.

కాగా.. హిండెన్ బర్గ్ అనే సంస్థను నాథన్ ఆండర్సన్ (Nathan Anderson) అనే వ్యక్తి సారథ్యం వహిస్తున్నారు. ఈ సంస్థ ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ లో ప్రావీణ్యం ఉన్నట్టు చెప్పుకుంటోంది. అంతర్జాతీయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల పుస్తకాలను ఈ సంస్థ తనదైన నైపుణ్యంతో జల్లెడ పడుతుంది. లోపాలు ఉన్నాయనే సందేహం వస్తే చాలు ఇక ఆ సంస్థలపైనే ఈ సంస్థ ఫుల్ ఫోకస్ పెడుతుంది. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా పూర్తి నివేదికను సిద్ధం చేస్తుంది.. ఆ పై ఇక బ్రహ్మాస్త్రంగా రిపోర్టును విడుదల చేస్తుంది. ఆ తరువాత ఆయా గ్రూప్ లేదా కంపెనీల్లో షార్ట్ పొజిషన్లను బిలియన్ డాలర్ల విలువ మేర తీసుకుంటుంది. ఆ తరువాత నివేదికను విడుదల చేస్తుంది. దీంతో ఇక షేర్ల అల్లకల్లోలం కొనసాగుతుంది. ఆ కంపెనీ పరిస్థితి ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీల్లేకుండా షేర్ల పతనాలు మొదల అదానీలా కంపెనీల పరిస్థితిగా మారిపోవచ్చు.. ఎందుకంటే హిండెన్ బర్గ్ నెట్ వర్క్ అలా ఉంటుంది.

Mukesh Ambani: ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ.. టాప్-10లో నిలిచిన ముకేష్ అంబానీ

కాగా.. గత జనవరి 24న అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ విడుదల చేసిన 106 పేజీల రిపోర్టుతో అదానీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అదానీ కంపెనీల షేర్లు పాతాళంలోకి పడిపోయాయి. దాదాపు 60 శాతం పైగా నష్టపోయారు. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలున్నాయని.. కంపెనీలు అన్నీ అప్పుల కుప్పలేనని.. విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటున్నట్టు ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక అదానీ గ్రూపు షేర్లను కుదిపేసింది. ఏకంగా ప్రపంచాన్నే షేక్ చేసింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. అదానీ అంశం భారత పార్లమెంట్ నే కుదిపేసింది. దీనిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. అంతేకాదు అదానీ అంశం భారతదేశం అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించే వరకు వెళ్లింది.