Jio Fiber Back-Up Plan : ఐపీఎల్ 2023 వచ్చేస్తోంది.. రూ. 198లకే జియోఫైబర్ కొత్త బ్యాకప్ ప్లాన్.. ఫ్రీగా క్రికెట్ మ్యాచ్‌లు చూడొచ్చు!
Jio Fiber Back-Up Plan : రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) మార్చి 27న కొత్త హోమ్ బ్రాడ్‌బ్యాండ్ 'బ్యాక్-అప్ ప్లాన్' (Back-Up Plan)ని 5 నెలలకు రూ.1,490కి ప్రకటించింది.

Jio Fiber Back-Up Plan _ Ahead of IPL 2023, Jio Fiber launches new broadband back-up plan; check details
Jio Fiber Back-Up Plan : ప్రపంచ బిలియనీర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) మార్చి 27న కొత్త హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ‘బ్యాక్-అప్ ప్లాన్’ (Back-Up Plan)ని 5 నెలలకు రూ.1,490కి ప్రకటించింది. ఈ బ్యాకప్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, లైవ్ స్పోర్ట్స్ (Live Sports)తో సహా ఇతర కంటెంట్‌తో పాటు రాబోయే టాటా IPL టోర్నమెంట్‌ను నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ మేరకు జియో కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. జియో యూజర్లు 10 Mbps నుంచి 30-100 Mbps వరకు స్పీడ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ మార్చి 30, 2023న ప్రారంభం కానుంది.
కొత్త ప్లాన్ 24×7 కనెక్షన్, ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే బ్యాకప్ కనెక్టివిటీని అందిస్తుంది. లైవ్ స్పోర్ట్స్‌తో సహా ఇతర కంటెంట్‌తో పాటు రాబోయే టాటా IPL టోర్నమెంట్‌లను నిరంతరాయంగా వీక్షించవచ్చు. ఇందుకోసం కొత్త (JioFiber) ‘బ్యాక్-అప్ ప్లాన్’ను రిలయన్స్ జియో సోమవారం కేవలం రూ. 198కి ప్రవేశపెట్టింది.
జియో యూజర్లు ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా 1/2/7 రోజుల ఆప్షన్లతో అవసరమైనప్పుడు (10 Mbps నుంచి 30 / 100 Mbps వరకు) స్పీడ్ అప్‌గ్రేడ్ చేయొచ్చు. 24×7 ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే బ్యాకప్ కనెక్టివిటీని పొందవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉన్న ఇళ్లకు ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుందని జియో తెలిపింది. 10Mbps స్పీడ్‌తో బొనాంజా ప్లాన్‌లు రూ. 298 సెట్-టాప్ బాక్స్, OTT యాప్‌లతో వస్తుంది. అయితే, మీరు కేవలం ఇంటర్నెట్‌ని మాత్రమే ఎంచుకుంటే.. ఈ ప్లాన్‌ను రూ. 198 తక్కువ ధరకే పొందవచ్చు.
5 నెలల ప్లాన్ కోసం మీరు రూ. 990 (రూ. 198 x 5), రూ. JioFiber పొందవచ్చు. రూ. 500కు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా, స్పీడ్ 30Mbps లేదా 100Mbpsకి అప్‌గ్రేడ్ చేసేందుకు మీరు 1, 2 లేదా 7 రోజుల పాస్ కూడా చెల్లించవచ్చు. సెట్-టాప్ బాక్స్, 6 లేదా 14 OTT యాప్‌లను పొందడానికి మీరు రూ. 100 లేదా రూ. నెలకు 200 వరకు చెల్లించవచ్చు.

Jio Fiber Back-Up Plan : Ahead of IPL 2023, Jio Fiber launches new broadband back-up plan
JioFiber కస్టమర్‌లను STB (సెట్-టాప్ బాక్స్)కి అప్‌గ్రేడ్ చేసేందుకు కూడా ఆఫర్ చేస్తోంది. నెలకు రూ. 100 ఎంటర్‌టైన్మెంట్ అప్‌గ్రేడ్‌తో మీరు ఫ్రీగా STB + 400 లైవ్ టీవీ ఛానెల్‌లు + 6 OTT (Over-the-Top) యాప్‌లు + YouTubeని పొందవచ్చు. నెలకు రూ. 200తో ఉచితంగా STB + 550 లైవ్ టీవీ ఛానెల్‌లు + 14 OTT యాప్‌లు + YouTubeని పొందవచ్చు. కొత్త జియో ఫైబర్ బ్యాకప్ కనెక్షన్‌ని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
1. బ్యాకప్ ప్లాన్ రూ. 1490 – 5 నెలల సర్వీస్ (రూ. 990) & ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు (రూ. 500)
2. ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌గ్రేడ్ రూ. 500 / 1,000 – నెలకు రూ. 100 / 200 5 నెలల పాటు పొందవచ్చు.
3. GST వర్తిస్తుంది.
4. కొత్త జియోఫైబర్ బ్యాకప్ కనెక్షన్ 30 మార్చి 2023 నుంచి అందుబాటులో ఉంటుంది.
5. కొత్త కనెక్షన్‌ని బుక్ చేసుకోవాలంటే 60008 60008కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
* jio.com/fiberని విజిట్ చేయండి.
* సమీప Jio రిటైలర్‌ను విజిట్ చేసి @ Rs 99తో బ్యాకప్ కనెక్షన్‌ని బుక్ చేసుకోండి.
కొత్త బ్రాడ్‌బ్యాండ్ బ్యాకప్ ప్లాన్‌పై మరిన్ని వివరాలివే :
ఈ లాంచ్‌పై జియో ప్రతినిధి మాట్లాడుతూ.. ‘భారత్ అతిపెద్ద హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీతో 24 గంటలూ కనెక్ట్ అయి ఉండేలా జియోలో JioFiber బ్యాకప్ అనే కొత్త ప్లాన్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. (TATA IPL 2023) మార్చి 31న ప్రారంభమై మే 21న ముగియనుంది. ఈ 10 క్రికెట్ జట్లు పోటీపడతాయి. ఈ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి.