World Economy: 2022లో ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను వెనక్కు నెట్టి దూసుకుపోతున్న భారత్

భారత దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని, ఎకానమీ పరంగా 2022లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమిస్తుందని బ్రిటిష్ కన్సల్టెన్సీ సెబర్ వెల్లడించింది.

World Economy: 2022లో ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను వెనక్కు నెట్టి దూసుకుపోతున్న భారత్

India Economy

World Economy: భారత దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని, ఎకానమీ పరంగా 2022లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమిస్తుందని బ్రిటిష్ కన్సల్టెన్సీ సెబర్ వెల్లడించింది. అంతే కాదు, అంతా సవ్యంగా జరిగితే 2023లో భారత్ బ్రిటన్ న్ను సైతం అధిగమించి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని “సెబర్” పేర్కొంది. రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సెబర్ కన్సల్టెన్సీ వెలువరించిన నివేదిక మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్ మార్కును దాటనుందని సెబర్ పేర్కొంది. అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఎదగాలని భావిస్తున్న చైనా, రెండేళ్లు వెనుకబడి 2030లో అగ్రస్థానానికి చేరుకుంటుందని సెబర్ నివేదికలో వెల్లడించింది. 2033 నాటికి జర్మనీ జపాన్ ను అధిగమిస్తుందని, 2034 నాటికీ ఇండోనేషియా 9వ స్థానానికి చేరుకుంటుందని సెబర్ వెల్లడించింది. ఇక 2036 నాటికి రష్యా టాప్ 10 ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని సెబర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

Also Read: Shirdi Sai Baba Temple : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ ఆలయ వేళల్లో మార్పులు.. రాత్రి మూసివేత, భక్తులకు అనుమతి లేదు

అయితే రానున్న ఎనిమిదేళ్లలో ఎదురయ్యే ద్రవ్యోల్బణ సవాళ్ళను ప్రపంచ దేశాలు ఎలా అధిగమిస్తాయోననే విషయం పైనే ఈ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని సెబర్ డిప్యూటీ చైర్మన్ డగ్లస్ మెక్‌విలియమ్స్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు 6.8 శాతంగా ఉండగా, ఆ ప్రభావం మిగతా దేశాలపై ఉంటుందని డగ్లస్ పేర్కొన్నారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ప్రపంచ దేశాలు మరింత ప్రోత్సహించడం ద్వారా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపిన డగ్లస్, అలా జరగని పక్షంలో 2023-24లో మరో భారీ ఆర్ధిక మాంద్యాన్నీ ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

Also Read: Nasal Covid-19 vaccine: ముక్కు ద్వారా కోవిడ్ వాక్సిన్: 2022 జనవరిలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం?