World No-3: అయ్యయ్యో అదానీ ర్యాంకు మళ్లీ పడిపోయింది.. రెండోసారి మూడో స్థానంలోకి ఆసియా కుబేరుడు

ఇక భారత కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సైతం ఒక స్థానాన్ని దిగజార్చుకున్నారు. ఇంతకు ముందు 10వ స్థానంలో ఉన్న ఆయన తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ముఖేశ్ సంపద 82.4 బిలియన్ డాలర్లు. ఇకపోతే ఆగస్టు 30న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మూడవ స్థానానికి వెళ్లిన అదానీ.. ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు

World No-3: అయ్యయ్యో అదానీ ర్యాంకు మళ్లీ పడిపోయింది.. రెండోసారి మూడో స్థానంలోకి ఆసియా కుబేరుడు

Gautam Adani slips to 3rd spot in global billionaires list

World No-3: సెప్టెంబర్ 19న ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో రెండవ స్థానాన్ని చేజిక్కించుకున్న భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీ మరోసారి వెనక్కి వెళ్లారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బీట్ చేయడంతో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. తాజాగా బ్లూంబర్గ్ ఇచ్చిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. కాగా, ఎప్పటిలాగే టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం అదానీ సంపద 135 బిలియన్ డాలర్లు. కాగా జెఫ్ బెజోస్ సంపద 138 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో బెజోస్ ముందుకు వచ్చి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా మూడో స్థానం నుంచి రెండవ స్థానానికి వచ్చిన అదానీ.. కాసేపటికే మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే తాజాగా తొమ్మిది రోజుల పాటు రెండో స్థానంలో కొనసాగడం గమనార్హం.

ఇక భారత కుబేరుల్లో రెండవ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సైతం ఒక స్థానాన్ని దిగజార్చుకున్నారు. ఇంతకు ముందు 10వ స్థానంలో ఉన్న ఆయన తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ముఖేశ్ సంపద 82.4 బిలియన్ డాలర్లు. ఇకపోతే ఆగస్టు 30న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మూడవ స్థానానికి వెళ్లిన అదానీ.. ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు. ఇక రెండవ స్థానాన్ని కూడా ఆయనే బ్రేక్ చేశారు. రాబోయే రోజుల్లో మస్క్‭ను దాటి మొదటి స్థానంలోకి వెళ్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‭పింగ్‭ను ఎవరూ నిర్భంధించలేదు.. ఇదిగో సాక్ష్యం