Smartphone Revenue: తగ్గిపోతున్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు… గత ఏడాది ఎంత తగ్గాయంటే?

గత ఏడాది భారీ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు, ఆదాయం తగ్గినట్లు ఒక నివేదికలో తేలింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ, మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటివి కూడా దీనికి కారణాలు. ఈ కారణంగానే గత ఏడాది స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.

Smartphone Revenue: తగ్గిపోతున్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు… గత ఏడాది ఎంత తగ్గాయంటే?

Smartphone Revenue: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది భారీ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు, ఆదాయం తగ్గినట్లు ఒక నివేదికలో తేలింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ, మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Women’s Premier League: మహిళా ప్రీమియర్ లీగ్.. ముంబై ఇండియన్స్ కోచ్‌లుగా ఝులన్ గోస్వామి, చార్లెట్ ఎడ్వర్డ్స్

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటివి కూడా దీనికి కారణాలు. ఈ కారణంగానే గత ఏడాది స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 2017 తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవడం ఇదే. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలకు సంబంధించి గత ఏడాది తగ్గిన ఆదాయం విలువ 409 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇది మొత్తం ఆదాయంలో 9 శాతం. ఫోన్ల అమ్మకాలు కూడా తగ్గాయి. 18 శాతం ఫోన్ల అమ్మకాలు తగ్గాయి. 2022 నాలుగో త్రైమాసికంలో 304 మిలియన్ యూనిట్ల ఫోన్ల అమ్మకాలు తగ్గిపోయాయి. కొత్త వినియోగదారుల సంఖ్య తగ్గడం, కార్మికుల లభ్యత లేకపోవడం వంటివి కూడా దీనికి కారణాలే. టాప్-5 స్మార్ట్‌ఫోన్ కంపెనీల అమ్మకాలు కూడా భారీగానే తగ్గాయి.

Currency Notes: ఇంటిగోడల్లో దొరికిన నోట్ల కట్టలు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓనర్‌కు షాక్.. అసలేం జరిగిందంటే!

గత ఏడాదికి సంబంధించి యాపిల్ సంస్థ అత్యధిక ఆదాయం పొందింది. మార్కెట్లో ఈ సంస్థ ఆదాయం వాటా 42 శాతంగా ఉంది. లాభాల్లో 85 శాతం వాటా కలిగి ఉంది. అమ్మకాలు, లాభాల్లో యాపిల్ సంస్థదే మార్కెట్లో ప్రధాన వాటాగా నిలిచింది. చైనా మొబైల్ కంపెనీలు మాత్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ, అమ్మకాలు నిలిచిపోయాయి. షావోమీ, ఒప్పో, వివో వంటి సంస్థలు నష్టాల్ని ఎదుర్కొంటున్నాయి. వీటి అమ్మకాలు దాదాపు 20 శాతంపైగా తగ్గిపోయాయి. ఏదేమనా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో స్మార్ట‌ఫోన్ తయారీ కంపెనీలు మాత్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.