Hyundai Verna Sedan Booking : హ్యుందాయ్ నుంచి సరికొత్త వెర్నా సెడాన్ కారు ఇదిగో.. డిజైన్ అదుర్స్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

Hyundai Verna Sedan Booking : ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) నుంచి నెక్స్ట్ జనరేషన్ కారు వచ్చేస్తోంది.

Hyundai Verna Sedan Booking : హ్యుందాయ్ నుంచి సరికొత్త వెర్నా సెడాన్ కారు ఇదిగో.. డిజైన్ అదుర్స్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

Hyundai teases new-gen Verna sedan, bookings now open

Updated On : February 14, 2023 / 7:09 PM IST

Hyundai Verna Sedan Booking : ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) నుంచి నెక్స్ట్ జనరేషన్ కారు వచ్చేస్తోంది. ఈ సరికొత్త కారు కు సంబంధించిన ఎక్స్‌టిరీయర్ డిజైన్ రివీల్ చేసింది. వెర్నా సెడాన్ (Verna Sedan) కారు కొనుగోలు చేయడానికి ముందుగానే బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్ కారు ఎక్స్ టీరియర్ డిజైన్‌ను హైలైట్ చేస్తూ సెడాన్‌ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఏడాది వేసవి నాటికి సెడాన్ డీలర్‌షిప్‌లలోకి వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ సెడాన్ కారు బుకింగ్‌పై మాట్లాడుతూ.. ‘మా ఐకానిక్ సెడాన్ – ఆల్-న్యూ హ్యుందాయ్ VERNA నెక్స్ట్ జనరేషన్ కారు బుకింగ్‌లను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌లోని విభిన్న భౌగోళిక ప్రాంతాలలో కల్ట్ ఫాలోయింగ్‌ కలిగిన VERNA మోడల్ కారు.. 4.6 లక్షల మంది కస్టమర్‌లను సంపాదించుకుంది.

16 సంవత్సరాల మన్నికైన వారసత్వాన్ని కలిగి ఉంది. సరికొత్త హ్యుందాయ్ VERNA అత్యుత్తమ పనితీరుతో కస్టమర్‌లను ఆకర్షించడానికి మునుపెన్నడూ లేని విధంగా థ్రిల్లింగ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. హ్యుందాయ్ నుంచి వచ్చిన ఈ బెంచ్‌మార్క్ సెడాన్ మా కస్టమర్ ఆకాంక్షలను నెరవేర్చుతుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Read Also : OnePlus 11 5G Sale in India : భారత్‌లో వన్‌ప్లస్ 11 5G సేల్ మొదలైందోచ్.. ఈ బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

హ్యుందాయ్ బ్రాండ్ వెర్నా సెడాన్ కారు పూర్తి డిజైన్‌ను రివీల్ చేయలేదు. హ్యుందాయ్ స్టారియా, కొత్త హ్యుందాయ్ కోనాతో చూసినట్లుగానే ఒకే LED లైట్ బార్‌తో ఫ్రంట్ సైడ్ కొత్త రీడిజైన్ ఫాసియాతో వస్తుంది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ బిజీ గ్రిల్‌కు పక్కనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. గ్రిల్ మధ్యలో ఓపెనింగ్ కూడా కనిపిస్తుంది, బహుశా ADAS సెన్సార్‌లను అమర్చవచ్చు. ఈ కారు 7 మోనోటోన్, 2 డ్యూయల్ టోన్ ఎక్స్‌టిరీయర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Hyundai teases new-gen Verna sedan, bookings now open

Hyundai Verna Sedan Booking : Hyundai teases new-gen Verna sedan, bookings now open

అందులో అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్ అనే మూడు కొత్త కలర్లు ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా సిల్హౌట్ చాలా కట్‌లు, లైన్‌లతో స్పోర్టియర్ షేప్‌తో రానుంది. కారు రూఫ్‌లైన్ కారును నాచ్‌బ్యాక్ చేస్తుంది. వెనుకవైపు, మీరు కనెక్ట్ చేసిన LED టైల్యాంప్ క్లస్టర్‌ని పొందవచ్చు. టెయిల్‌ల్యాంప్‌లు హ్యుందాయ్ పారామెట్రిక్ డిజైన్ లాంగ్వేజ్ సూచనతో ఆకర్షణీయమైన బిజీ లుక్‌ను కలిగి ఉన్నాయి.

నెక్స్ట్ జనరేషన్ వెర్నాతో రానున్న పవర్‌ట్రెయిన్‌ల గురించి హ్యుందాయ్ వివరాలను వెల్లడించింది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT, 1.5-లీటర్ NA పెట్రోల్‌తో అందుబాటులో ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT)తో రానుంది. ఈ రెండు ఇంజన్‌లు RDE నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. E20 ఇంధనాన్ని అమలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా నాలుగు ట్రిమ్ లెవల్స్‌లలో EX, S, SX, SX(O) మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

Read Also : Valentine’s Day Special : వ్యాలెంటైన్స్ డే స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!