Itarsi Junction: రైల్వేలో అత్యధిక ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్లు ఆ స్టేషన్ నుంచే

దేశంలోనే రైల్వే స్టేషన్లలో అత్యధిక ఆర్డర్లు డెలివరీ చేసిన స్టేషన్ గా మధ్యప్రదేశ్ లోని "ఇటార్సీ జంక్షన్" నిలిచినట్లు రైల్వేశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Itarsi Junction: రైల్వేలో అత్యధిక ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్లు ఆ స్టేషన్ నుంచే

Irctc

Itarsi Junction: దేశంలో ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిపోతుంది. ఆర్డర్ చేసిన పది నిముషాల్లోనే సామాగ్రి ఇంటికి వచ్చి చేరుతుంది. ప్రజలు తమ సమయం ఆదా చేసుకునేలా ఆన్‌లైన్‌ ఈ కామర్స్ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. ప్రైవేటు రంగంతో పాటు కొన్ని ప్రభుత్వశాఖలు సైతం ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఆర్డర్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ.. భారత రైల్వే సైతం తమ ప్రయాణికులకు ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. భారతీయ రైల్వే అనుబంధంగా ఫుడ్ క్యాటరింగ్ నిర్వహిస్తున్న IRCTC రైల్వే ప్రయాణికుల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు స్వీకరిస్తుంది. ప్రయాణికులు గమ్యస్థానం చేరుకునేలోగా మార్గమధ్యలో IRCTC యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే..తదుపరి స్టేషన్లోనే ఆ ఆర్డర్ ప్రయాణికుడికి చేరేలా IRCTC సేవలు అందిస్తుంది.

Also read: Japan – India: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

రైల్వే శాఖ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ప్రయాణికులు ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. ఈక్రమంలో దేశంలోనే రైల్వే స్టేషన్లలో అత్యధిక ఆర్డర్లు డెలివరీ చేసిన స్టేషన్ గా మధ్యప్రదేశ్ లోని “ఇటార్సీ జంక్షన్” నిలిచినట్లు రైల్వేశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలలో సరాసరి ఆర్డర్లు వస్తున్నాయని, ఇటార్సీ జంక్షన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 18 వేలకు పైగా ఫుడ్ ఆర్డర్లు డెలివరీ అయినట్లు అధికారులు తెలిపారు. మహానగరాల్లోని రైల్వే స్టేషన్లను కాదని ఇటార్సీ జంక్షన్ అగ్రస్థానంలో నిలవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రధానంగా..భారత రైల్వేలోని అన్ని జోన్లను కలుపుతూ ఇటార్సీ జంక్షన్ భౌగోళికంగా మధ్య భాగంలో ఉంది.

Also read: Rakesh jhunjhunwala : ఒక్కరోజులో రూ. 861 కోట్లు సంపాదన

ఇటార్సి జంక్షన్‌లో రైల్వే ప్రయాణికులకు భోజనాన్ని అందించేందుకు 17 ఫుడ్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ 150 రైళ్లు రాకపోకలు సాగిస్తూ దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఇటార్సీ స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్‌లో రైలు సగటున 10 నిమిషాలు ఆగుతుంది. దీంతో ప్రయాణీకులు ఇక్కడి ప్లాట్ ఫార్మ్ పై దిగి అక్కడే ఆహారం తినేందుకు సమయం సరిపోతుంది. దీనితో పాటుగా ఇటార్సీ నుంచి దక్షిణాన నాగ్‌పూర్, హైదరాబాద్, విజయవాడ వైపు, తూర్పున అలహాబాద్, ఇండోర్, రాజ్ కోట్, మరియు ఉత్తరానా ఝాన్సీ, ఢిల్లీకి రైళ్లు చేరుకుంటాయి. నాగ్‌పూర్ మినహా ఈ స్టేషన్‌లకు రైలు చేరుకోవడానికి సరాసరి ఆరు గంటల సమయం పడుతుంది. దీంతో ఇటార్సీ చేరుకునేసరికి ప్రయాణికులు భోజనానికి ఉపక్రమిస్తుంటారు. ఈ కారణంగా ఇటార్సీ జంక్షన్ నుంచి గరిష్టంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లు అందుతున్నాయి.

Also read:Cyclone Asani: రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రతరం: అండమాన్ నికోబార్ దీవులకు ప్రమాద హెచ్చరికలు