Cyclone Asani: రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రతరం: అండమాన్ నికోబార్ దీవులకు ప్రమాద హెచ్చరికలు

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు

Cyclone Asani: రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రతరం: అండమాన్ నికోబార్ దీవులకు ప్రమాద హెచ్చరికలు

Cyclone

Cyclone Asani: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా పరిణమించి రానున్న 48 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణశాఖ IMD హెచ్చరించింది. గత రెండు రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మార్చి 21 నాటికి తీవ్ర తుపానుగా మారనుందని దీని ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోల్లం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. అసానిగా నామకరణం చేసిన ఈ తుఫాను..అండమాన్ నికోబార్ దీవులపై విరుచుకు పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈక్రమంలో గత నాలుగు రోజులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా..అండమాన్ నికోబార్ దీవుల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read: Japan PM Fumio Kishida : ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్న జపాన్ ప్రధాని పుమియో కిషిడా

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు. ద్వీపసమూహంలోని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించడంతో సహా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక శిబిరాల్లో ఆహారం, నీరు, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జితేంద్ర నారాయణ్ అన్ని శాఖలను ఆదేశించారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ లను స్టాండ్ బైలో ఉంచారు. అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖలు సహాయంతో సిద్ధంగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read; Maharashtra Politics: మహావికాస్ అఘాదిలో చేరడానికి ఎఐఎంఐఎం కసరత్తు: మూడు చక్రాల బండికి నాలుగో చక్రం

తుఫాను దృష్ట్యా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతంలో ఓడలు పోర్టుల్లోనే ఆగిపోవాలని సూచించిన అధికారులు, వేటకు వెళ్లిన పడవలను వెనక్కు పిలిపించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మార్చి 19 ఉదయం వరకు తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ, మార్చి 20 వరకు అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ సంస్థ తెలిపింది. మార్చి 21న తీవ్ర తుఫానుగా మారే క్రమంలో 70-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. మార్చి 22 నాటికి బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు సమీపంలో ఉత్తర-ఈశాన్య దిశగా తుఫాను వెళ్ళిపోతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఇదిలాఉంటే గత 132 సంవత్సరాలలో మార్చి నెలలో ఒక్క ఉష్ణమండల తుఫాను కూడా ఈ ప్రాంతాన్ని తాకలేదని, మార్చిలో అండమాన్ మరియు నికోబార్ దీవులను తాకిన మొట్టమొదటి ఉష్ణమండల తుఫానుగా అసాని నిలవనుందని వాతావరణ విశ్లేషకులు పేర్కొన్నారు.

Also Read; Tirumala Car burnt : తిరుమలకు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం