Japan PM Fumio Kishida : ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్న జపాన్ ప్రధాని పుమియో కిషిడా

ప్ర‌ధాని నరేదంద్ర మోడీతో జపాన్ ప్రధాని పుమియో కిషిడా భేటీ కానున్నారు. భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.

Japan PM Fumio Kishida : ప్ర‌ధాని మోడీతో భేటీ కానున్న జపాన్ ప్రధాని పుమియో కిషిడా

Japan Pm Fumio Kishida India Pm Modi Meeting

japan PM fumio kishida india PM modi meeting : జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి ఫుమియో కిషిడా, భార‌త ప్ర‌ధాని మంత్రి మోడీ కీల‌క భేటీ కానున్నారు. భారత్ పర్యటనకు విచ్చేసిన జపాన్ ప్రధాని పుమియో కిషిడా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధానికి ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు.ప్రపంచ, ప్రాంతీయ సమస్యలు,ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

Also read : Punjab AAP Govt :పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..25,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం

జపాన్,భారత్ దేశాల మ‌ధ్య‌ శిఖరాగ్ర సదస్సు నేటీ నుంచి ప్రారంభం కానున్న‌ది. ఇందులో భాగంగా.. జపాన్ ప్రధాని భార‌త్ కు వచ్చారు. మార్చి 19,20 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. శనివారం (మార్చి 19,2022)శిఖరాగ్ర చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల‌ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం సహకారం గురించి ఇద్దరు నేతలు మాట్లాడతారని సమాచారం. 14వ ఇండియా-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జ‌పాన్ ప్ర‌ధాని రెండు రోజుల పాటు భారతదేశంలో అధికారంగా పర్యటించనున్నారు. జపాన్ ప్రధాని పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-జపాన్ ల‌ శిఖరాగ్ర సమావేశం మార్చి 19,20 న జరుగుతుంది అని తెలిపారు.

Also read : Shocking : 24,000 ఏళ్లుగా మంచులోనే బతికే ఉన్న వింత జీవి..!

ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భార‌త్ కు విచ్చేశారు. 14వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం లో భాగంగా మార్చి 19 నుంచి మార్చి 20 వరకు న్యూఢిల్లీలో అధికారిక పర్య‌టించ‌నున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు, మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ సదస్సు ఇరు పక్షాలకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఇండో పసిఫిక్ శాంతి సుస్థిరత, శ్రేయస్సు కోసం భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరుపక్షాలకు అవకాశాన్ని అందిస్తుందని బాగ్చి తెలిపారు. జపాన్, భారత్ నేతల మధ్య ఇదే తొలి భేటీ.