MSME: తెలుగు రాష్ట్రాల్లో MSME వృద్ధికి రూ.800 కోట్లకు పైగా ఇవ్వనున్న కినారా క్యాపిటల్

సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) మద్దతు ఇవ్వడం, ఆదాయ ఉత్పత్తి, ఉద్యోగ కల్పన కోసం కొత్త అవకాశాలతో బలమైన సంఘాలను నిర్మిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని MSMEలకు కినారా ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను పంపిణీ చేసింది

MSME: తెలుగు రాష్ట్రాల్లో MSME వృద్ధికి రూ.800 కోట్లకు పైగా ఇవ్వనున్న కినారా క్యాపిటల్

Telugu States: తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వేలాది MSMEలకు మద్దతు ఇచ్చే ప్రణాళికలతో తన పరిధిని మరింతగా పెంచుతుకునేందుకు కినారా క్యాపిటల్ ప్రణాళికలు రచిస్తోంది. 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాల్లోని ఎంఎస్ఎంఈలకు ఎలాంటి తనఖా 800 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార రుణాలు అందించనున్నట్లు తెలిపింది. 2016లో ఫిన్‌టెక్ ఈ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు కంపెనీ 20,000 కు పైగా వ్యాపార రుణాలను అందించింది.

Oil Plantation Partnership: అస్సాం ప్రభుత్వంతో ఆయిల్ ప్లాంటేషన్ భాగస్వామ్యం.. ఈశాన్య వ్యవసాయ రంగంలో మార్పు తెస్తామంటూ ప్రకటన

సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు (MSMEలు) మద్దతు ఇవ్వడం, ఆదాయ ఉత్పత్తి, ఉద్యోగ కల్పన కోసం కొత్త అవకాశాలతో బలమైన సంఘాలను నిర్మిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని MSMEలకు కినారా ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను పంపిణీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కినారా క్యాపిటల్ ఈ ప్రధాన MSME సబ్ సెక్టార్‌లలో ఆహార ఉత్పత్తులు, నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రికల్స్, ఫ్యాబ్రికేషన్, చెక్క ఉత్పత్తులు, మెటల్ భాగాలు, ఫ్యాషన్ లలో అత్యధిక డిస్బర్సుమెంట్, వృద్ధిని సాధించింది. తయారీ, వాణిజ్యం, సేవల రంగాల్లో ఉన్న MSME రంగాలలో 300 కంటే ఎక్కువ ఉప-రంగాలకు వ్యాపార రుణాలను కినారా అందిస్తుంది.